by సూర్య | Sun, Apr 14, 2024, 04:01 PM
రణస్థలం మండలం జేఆర్ పురం పంచాయతీ పరిధిలో ఆదివారం ఉదయం కూటమి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు సతీమణి రజిని పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటింటికి వెళ్లి. కరపత్రాలను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వంతోనే మహిళా సాధికారత సాధ్యమని దీనిని ప్రజలు గుర్తించి రానున్న ఎన్నికల్లో కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్నారు.
Latest News