by సూర్య | Sun, Apr 14, 2024, 03:15 PM
హిందూపురం పట్టణంలో ఎన్నికల విధుల్లో భాగంగా రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పోలీసులు శనివారం రాత్రి వాహనాల తనిఖీ చేస్తుండగా ద్విచక్రవాహనంలో తరలిస్తున్న రూ. 8. 08 లక్షల నగదు పట్టుబడింది. కర్ణాటక రాష్ట్రం గౌరిబిదనూరులోని సప్తగిరి ప్రావిజన్ స్టోర్ నిర్వాహకులు ఇద్దరి వద్ద ఈ సొమ్మును స్వాధీనం చేసుకొన్నారు. డబ్బుకు సంబంధించి, వారు ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో ఆ సొమ్మును సీఐ రియాజ్ అహమ్మద్ సీజ్ చేశారు.
Latest News