![]() |
![]() |
by సూర్య | Sun, Apr 14, 2024, 03:10 PM
గుంతకల్లులో రూ. 2. 50 లక్షలు నగదును సీజ్ చేసినట్లు ఒకటవ పట్టణ సీఐ రామ సుబ్బయ్య విలేకరుల సమావేశంలో తెలిపారు. పట్టణంలోని ఆలూరు రోడ్డు రైల్వే బ్రిడ్జి వద్ద శనివారం తమ సిబ్బందితో వాహనాలు తనిఖీలు చేస్తున్నారన్నారు. గుంతకల్లు మండలం సంఘాల గ్రామానికి చెందిన రామాంజినేయులు ఆదోని నుంచి కారులో ఎలాంటి రసీదులు లేకుండా నగదు తీసుకు వెళుతుండగా సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. డిప్యూటీ తహశీల్దారు సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.
Latest News