దేవాదాయ శాఖ సిబ్బందికి ఎన్నికల విధులు అప్పగించవద్దు

by సూర్య | Sat, Apr 13, 2024, 09:47 PM

దేవాదాయ శాఖ సిబ్బందికి ఎన్నికల విధులను అప్పగించ వద్దంటూ బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ఈ మేరకు శనివారం నాడు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఆమె లేఖ రాశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో దేవాదాయ శాఖ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్లు, బ్యూరోక్రసీలోని కొందరు ఉన్నతాధికారులు కలిసి సీఈఓ ముకేష్ కుమార్ మీనాకు సూచించినట్లు తెలిసిందని చెప్పారు. గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలకు దేవాదాయ శాఖ సిబ్బంది సేవలను ఏనాడూ వినియోగించుకోలేదని గుర్తుచేశారు. ఈ విషయంలో గతంలో ఎన్నికల విధుల్లో పనిచేసిన అధికారుల నిర్ణయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేవాదాయ శాఖ సిబ్బంది సాధారణంగా తమ పరిధిలోని దేవాలయాల్లో రోజువారీగా పరిపాలనా విధులు నిర్వర్తిస్తారని తెలిపారు. పరిపాలనలో ఏదైనా అంతరాయం ఏర్పడితే భక్తులు ఇబ్బందులు పడతారన్నారు. ఆలయాల్లో నిర్ధిష్ట విధులను, ఆగమ శాస్త్ర మార్గదర్శకాలను ఆమోదించడం ద్వారా వాయిదా వేయలేరని చెప్పారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM