రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం

by సూర్య | Sat, Apr 13, 2024, 09:37 PM

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలకు చిరు చినుకులు ఉపశమనం కలిగించాయి. జల్లులతో పాటు నగరంలో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. మరికొద్ది సమయంలో సీఎం జగన్ బస్సు యాత్రగా వస్తున్న తరుణంలో నగరంలో ఈదురు గాలులతో పార్టీల ఫ్లెక్సీలు, హోర్డింగ్ లు ఎగిరిపోయాయి. నగంలోని గోతులమయంగా మారిన రోడ్లలో నీరు నిలిచింది. దీంతో గమ్య స్థానాలకు వెళ్లేందుకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నిన్నా మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఎండలు దంచికొట్టాయి. ఓవైపు 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఐఎండీ చల్లని కబురు మోసుకొచ్చింది. ఉత్తర కోస్తాలో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని వెల్లడించింది. దక్షిణ కోస్తాలో మాత్రం వాతావరణం పొడిగానే ఉంటుందని వివరించింది. రాయలసీమ జిల్లాల్లో మాత్రం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM