మ‌న ప్ర‌భుత్వంలో కుల, మత, రాజకీయాలకు అతీతంగా లబ్ధి జరిగింది

by సూర్య | Sat, Apr 13, 2024, 05:02 PM

మగ్గం ఉన్న ప్రతీ కుటుంబానికి చేయూతనిచ్చిన ప్రభుత్వం మనది అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. మ‌న ప్ర‌భుత్వంలో కుల, మత, రాజకీయాలకు అతీతంగా లబ్ధి జరిగింది. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పథకం అమ‌లు చేసిన సందర్భం ఉందా?. నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.3706 కోట్లు ఖర్చు చేశాం. 1.06లక్షల మందికి లబ్ధి జరిగింది. గతంలో లంచాలు ఇస్తే కూడా సంక్షేమ పథకం అందని పరిస్థితి ఉండేద‌న్నారు. ఎన్నికల్లో మన బతుకులు మార్చే నాయకుడిని ఎన్నుకోవాలన్నారు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతామని సూచించారు. రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్న చంద్రబాబు విషయం జాగ్రత్తగా ఉండాలన్నారు. సూపర్‌ సిక్స్‌, సెవెన్‌ అంటూ వస్తున్న చంద్రబాబు గతంలో చేసిన అన్యాయాన్ని గుర్తుచేసుకోవాలని సూచించారు.  సీఎం వైయ‌స్ జగన్‌ మేమంతా సిద్ధం బస్సుయాత్ర మంగళగిరికి చేరుకుంది. ఈ సందర్భంగా సీఎం వైయ‌స్ జగన్‌ చేనేత కార్మికులతో ముఖాముఖి అయ్యారు. 

Latest News

 
ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్‌కు రంగం సిద్ధం Wed, May 22, 2024, 01:40 PM
పిన్నెల్లిని అరెస్ట్ చేస్తారా..? Wed, May 22, 2024, 01:18 PM
బాల్య వివాహాల అరికట్టే దిశగా అవగాహన కల్పించాలి Wed, May 22, 2024, 01:17 PM
ద్వారకా తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు Wed, May 22, 2024, 01:16 PM
జూన్ 4ఫలితాలతో జగన్ పనైపోతుంది Wed, May 22, 2024, 01:15 PM