బాపట్ల, రేపల్లె నియోజకవర్గాలలో చంద్రబాబు సమీక్ష

by సూర్య | Sat, Apr 13, 2024, 04:47 PM

 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం - జనసేన - బీజేపీ పొత్తులు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తుడంటంతో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గెలుపు వ్యూహాలపై పదును పెట్టారు. ఇందులో భాగంగానే బాపట్ల పార్లమెంట్‌లోని అసెంబ్లీ అభ్యర్థులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సమావేశానికి కూటమి నేతలు కూడా హాజరయ్యారు. మొదట రేపల్లె నియోజకవర్గం నేతలతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఎన్నికలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. అభ్యర్థుల బలాబలాలపై బేరీజు వేసుకుంటున్నారు. అధికార వైసీపీని ఎన్నికల్లో ఎలా ఢీకొట్టాలనే అంశంపై కూటమి నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇంటింటికీ నేతలు ప్రచారం చేయాలని సూచించారు.

Latest News

 
వైసీపీ అధినేత జగన్ పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి సారించారు Tue, Apr 29, 2025, 04:33 PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది Tue, Apr 29, 2025, 04:29 PM
వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి మంజూరైన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరిగింది Tue, Apr 29, 2025, 04:27 PM
ప్రియురాలిని హత్య చేసి బావిలో పడేశాడు Tue, Apr 29, 2025, 03:51 PM
చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం: జగన్ Tue, Apr 29, 2025, 03:46 PM