సీఎం జగన్ తరుపున ప్రచారానికి భారతి

by సూర్య | Sat, Apr 13, 2024, 04:46 PM

కడప జిల్లా  అంటే వైయస్ ఫ్యామిలీ .. వైయస్ ఫ్యామిలీ అంటే కడప జిల్లా. అలాంటి జిల్లాలో రాజకీయం ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల.. కడప ఎంపీగా బరిలో దిగారు. దీంతో ప్రచారంలో ఆమె బాణంలా దూసుకు పోతున్నారు. మరోవైపు ఏప్రిల్ 22వ తేదీన వైసీపీ అధినేత వైయస్ జగన్ .. పులివెందుల  అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆ క్రమంలో ఆయన భార్య వైయస్ భారతీ సైతం భర్తకు మద్దతుగా ఇంటి ఇంటికి ప్రచారం నిర్వహించనున్నారని సమాచారం. అయితే గత ఎన్నికల వేళ జరిగిన ప్రచారానికి.. ప్రస్తుతం జరుగనున్న ఎన్నికల ప్రచారంతో కడప రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయినట్లు అవుతోంది.అంటే గత ఎన్నికల వేళ వైయస్ ఫ్యామిలీలోని వారంతా ఒక తాటిపైకి వచ్చారు. వైయస్ జగన్ గెలుపు కోసం వారంత ప్రచారం చేశారు. కానీ నేడు కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగిన వైయస్ షర్మిల.. తన గెలుపు కోసం ఆమె స్వయంగా ప్రచారం చేసుకొంటున్నారు.ఇక వైయస్ జగన్.. తన గెలుపు కోసం ఆయనే ప్రచారం చేసుకొనే పరిస్థితి. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే వైయస్ జగన్ కోసం ఆయన భార్య వైయస్ భారతీ ప్రచారం నిర్వహించనున్నారనే ఓ ప్రచారం అయితే జిల్లాలో జోరందుకొంది.ఓ వేళ వైయస్ భారతీ.. తన భర్త గెలుపు కోసం ప్రజల మధ్యకు వెళ్లి ప్రచారం చేస్తే.. ఆమె ప్రచారాన్ని ప్రజలు ఎలా తీసుకుంటారనే ఓ చర్చ సైతం జిల్లాలో నడుస్తోంది. ఎందుకంటే వైయస్ వివేకా మరణించారనే వార్తా.. తన భర్త వైయస్ జగన్‌కు తొలుత ఆమే స్వయంగా ఫోన్ చేసి సమాచారం ఇచ్చారంటూ ఇప్పటికే పలు కథనాలు అయితే వైరల్ అయినాయి. అలాంటి పరిస్థితుల్లో తన భర్త గెలుపు కోసం వైయస్ భారతీ ప్రచారం చేస్తే.. దానిని ప్రజలు ఎలా స్వీకరిస్తారోననే ఓ సందేహం సైతం జిల్లాలో వ్యక్తమవుతోంది.మరోవైపు తన సొంత చిన్నాన్న వైయస్ వివేకా హత్యతో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి హస్తం ఉంది. అతడికి ఓటు వేయవద్దంటూ ఎన్నికల ప్రచారంలో నేరుగా ప్రజలకు వైయస్ షర్మిల వివరిస్తోంది. ఇదే ప్రచారంలో వైయస్ వివేకా కుమార్తె సునీత నర్రెడ్డి సైతం పాల్గొని తన తండ్రిని హత్య చేసిన వారికి ఓట్లు వేయ్య వద్దంటూ.. స్పష్టం చేస్తోంది. దీంతో ప్రజలు ఓ విధమైన కన్ఫ్యూజన్‌లోకి వెళ్లిపోతున్నారని సమాచారం.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM