వైసీపీ బ్యానర్లు తొలగించిన ఎలక్షన్ అధికారులు

by సూర్య | Sat, Apr 13, 2024, 04:42 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం జగన్ మోహన్‌ రెడ్డి ప్రచారంలో దూకుడు పెంచారు. ‘‘మేమంతా సిద్ధం’’  పేరిట బస్సు యాత్ర చేస్తూ రాష్ట్రమంతటా ప్రజల్లోకి వెళ్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో బస్సు యాత్రతో సీఎం ప్రచారం నిర్వహించారు. అయితే బస్సు యాత్ర సందర్భంగా తమ అధినేతకు ఘన స్వాగతం పలికేందుకు వైసీపీ కార్యకర్తలు ఆయా ప్రాంతాల్లో ఆ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటారు. ఈ వ్యవహారంపై దృష్టి సారించిన ఎన్నికల సంఘం... అధికార పార్టీకి గట్టి షాక్ ఇచ్చింది. ‘‘మేమంతా సిద్ధం’’ బస్సు యాత్రలో భాగంగా జాతీయ రహదారి మీద ఏర్పాటు చేసిన జెండాలు, ఫ్లెక్సీలు ఈసీ తొలగించేసింది. ఎమ్‌సీసీ పర్యవేక్షణ అధికారి రహీం నేతృత్వంలో తాడేపల్లి, విజయవాడ మధ్య కృష్ణా వారధిపై ఏర్పాటు చేసిన జెండాలను తొలగించారు. వారధికి రెండు వైపులా ఏర్పాటు చేసిన బ్యానర్లు తాడేపల్లి మున్సిపల్ సిబ్బంది తీసివేసింది. కాగా.. ఈరోజు (శనివారం) తాడేపల్లి మీదుగా ఎన్టీఆర్ జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశించనుంది. ఈ క్రమంలో వారధి వద్ద వైసీపీ శ్రేణులు చేసిన స్వాగత ఏర్పాట్లను ఎన్నికల సంఘం అధికారులు తొలగించారు.

Latest News

 
శ్రీశైలం డ్యాం భద్రతకు పొంచి ఉన్న పెను ముప్పు Fri, Dec 05, 2025, 07:33 AM
తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టులో అప్పీల్ Fri, Dec 05, 2025, 07:26 AM
రైతులను దగా చేసిన వైసీపీ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తోందని విమర్శ Fri, Dec 05, 2025, 07:24 AM
కార్యకర్తల కష్టం త్యాగాల వల్లే కూటమి అధికారంలోకి వచ్చింద్న లోకేశ్ Fri, Dec 05, 2025, 06:31 AM
అమరావతిని క్రియేటివ్ సిటీగా తీర్చిదిద్దుతామన్న సీఎం చంద్రబాబు Thu, Dec 04, 2025, 10:57 PM