by సూర్య | Sat, Apr 13, 2024, 03:55 PM
ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు అని, ఈ ప్రాంతం అభివృద్ధికి ఏనాడూ కట్టుబడి లేరు అని, విశాఖను రాజధానిగా చేసే విషయమై ఇక్కడి టీడీపీ నాయకులు తమ స్టాండ్ ఏంటో చెప్పగలరా ? ఈ ప్రాంత ప్రయోజనాలు పట్టని నాయకులు ఎన్నికల్లో ఓట్లేయమని అభ్యర్థిస్తున్నారా ? గతంలో కూడా ఈ ప్రాంత అభివృద్ధి పట్టక చంద్రబాబు నాయుడు వ్యవహరించారు. విభజనలో భాగంగా మనకు దక్కిన 23 కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఒక్కటి కూడా ఈ జిల్లాలో ఏర్పాటు చేయకుండా ఆయన ద్రోహం చేశారు అనేందుకు ఆధారాలు ఉన్నాయని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. కోడి రామ్మూర్తి స్టేడియం పనుల పూర్తికి కట్టుబడి ఉన్నాం అని రెవెన్యూ మంత్రి పేర్కొన్నా రు. ఇప్పటికే నిధులు కేటాయించి పనులు కొంత మేర పూర్తి చేయించాం అని,మిగిలిన పనులు పూర్తి చేయించేది కూడా తానేన ని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు విపక్ష నేత చంద్రబాబుకు ప్రజలు కానీ వారి సమస్యలు గుర్తుకు రావు అని,అధికా రం పోగానే వారిపై ప్రేమ నటిస్తుంటారని విమర్శించారు. రాజధాని పేరిట మన ప్రాంత ప్రజల పీక నొక్కేశారని,మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖే రాజధాని అని,పరిపాలన రాజధానిగా విశాఖను మారుస్తామని అన్నారు. ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో వాకర్స్ ని శనివారం ఉదయం కలిశారు. ప్రభుత్వ విధానాలు.,వాటి వెనుక ఉన్న ఉద్దేశాలను వివరించారు.
Latest News