అందుకే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాం

by సూర్య | Fri, Apr 12, 2024, 06:18 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో  పొత్తు రాజకీయాలు కాక రేపుతున్నాయి. అధికార వైసీపీని గద్దె దించాలనే లక్ష్యంతో టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీలు ఇప్పటికే కూటమిగా జట్టు కట్టాయి. ఈ క్రమంలో ఏపీలో కాంగ్రెస్, వామపక్ష పార్టీల మధ్య పొత్తు కుదిరింది. పొత్తులో భాగంగా సీపీఎం తరపున ఒక ఎంపీ, 8 మంది ఎమ్మెల్యేలు పోటీ చేసేందుకు కాంగ్రెస్ తో ఒప్పందం కుదిరింది. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడిన స్థితిలో వామపక్షాలు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాయి. అరకు (ఎస్టీ) పార్లమెంట్ స్థానానికి పాచిపెంట అప్పలనర్సయ్య, రంపచోడవరం (ST) కు లోతా రామారావు, నెల్లూరు సిటీకీ మూలం రమేష్‌, కురుపాం (ఎస్టీ)కి మండంగి రమణ, గాజువాక నుంచి మరడాన జగ్గునాయుడు, విజయవాడ సెంట్రల్‌ కు చిగురుపాటి బాబురావు, గన్నవరం నుంచి కళ్లం వెంకటేశ్వరరావు, మంగళగిరికి జొన్నా శివశంకర్‌ పోటీ చేస్తుండగా పాణ్యం స్థానాన్ని పెండింగ్ లో ఉంచారు. అరకు (ఎస్టీ) పార్లమెంట్ స్థానానికి పాచిపెంట అప్పలనర్సయ్య బరిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం పోరాడేది తమ పార్టీ మాత్రమేనని ఈ ప్రయాణంలో భాగంగా వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నట్లు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. తామంతా కలిసి పోరాటం చేస్తామని వెల్లడించారు. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్‌ జగన్‌, చంద్రబాబు ఇద్దరూ విఫలమయ్యారని ఘాటుగా విమర్శించారు.

Latest News

 
వెన్నునొప్పి వేధిస్తోందా.. ఈ విషయాలు తెలుసుకోండి Thu, Oct 24, 2024, 06:49 PM
కాపులకు ఇచ్చిన ప్రతీ హామీని సీఎం అమలు చేస్తారు: మంత్రి Thu, Oct 24, 2024, 06:46 PM
వారిపై చర్యలు తీసుకోవాలి: చందు నాయక్ Thu, Oct 24, 2024, 06:45 PM
అమరావతి రైల్వే లైన్ కు కేంద్రం ఆమోదం హర్షం వ్యక్తం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ Thu, Oct 24, 2024, 06:34 PM
ఈ ప్రాజెక్టు నాలుగేళ్లలో పూర్తవుతుందన్న సీఎం చంద్రబాబు Thu, Oct 24, 2024, 06:31 PM