ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల

by సూర్య | Fri, Apr 12, 2024, 03:27 PM

 ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల అయ్యాయి. టర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను కమిషనర్ ఒకే సమయంలో విడుదల చేశారు. ఈ ఫలితాల కోసం విద్యార్థులు http://resultsbie.ap.gov.in/ లో చెక్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కృష్ణా జిల్లా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. సెకండ్ ప్లేస్‌లో గుంటూరు, థర్డ్ ప్లేస్‌లో ఎన్టీఆర్ జిల్లా ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు మొత్తం 4,61,273 మంది విద్యార్థులు హాజరవగా.. 3,10,875 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఉత్తీర్ణత సాధించిన బాలికలు 67%. సెకండ్ ఇయర్ పరీక్షలకు మొత్తం 3,93,757 మంది విద్యార్థులు హాజరవగా.. 3,06,528 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 78. ఒకేషనల్ కోర్స్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 38,483 మంది హాజరవగా.. 23,181 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్ పరీక్షకు 32,339 మంది విద్యార్థులు హాజరవగా.. 23,000 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

Latest News

 
పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రంగంలోకి అధికారులు.. సరస్వతి పవర్ భూముల్లో సర్వే Sat, Oct 26, 2024, 11:48 PM
నిరుద్యోగులకు శుభవార్త.. ఆర్టీసీలో భారీగా ఉద్యోగాల భర్తీ Sat, Oct 26, 2024, 11:48 PM
ఆగిపోయిన ఆర్టీసీ బస్సు.. టాలెంట్ చూపెట్టిన డ్రైవరన్న Sat, Oct 26, 2024, 11:46 PM
ప్రేమ పెళ్లి చేసుకున్న జంటకు పోలీసుల ట్విస్ట్ Sat, Oct 26, 2024, 10:16 PM
తిరుమలలో శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం.. స్వయంగా రంగంలోకి దిగిన ఈవో Sat, Oct 26, 2024, 10:14 PM