పొత్తుల కారణంగా కొన్ని సీట్లు తలకిందులు అయ్యాయి

by సూర్య | Fri, Apr 12, 2024, 03:26 PM

ఉండి నియోజకవర్గం నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక భేటీ నిర్వహించారు. ఉండి నియోజకవర్గాన్ని రఘురామకృష్ణం రాజుకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. భేటీ సందర్భంగా చంద్రబాబు సైతం కీలక కామెంట్స్ చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఉండి నియోజకవర్గం నేతలతో భేటీ అవ్వాల్సి వస్తోందన్నారు చంద్రబాబు. పొత్తుల కారణంగా కొన్ని సీట్లు తలకిందులు అయ్యాయని పార్టీ కేడర్‌కు వివరించే ప్రయత్నం చేశారు చంద్రబాబు. ‘ప్రత్యేక పరిస్థితుల్లో ఉండి నుంచి మీ అందరినీ పిలవాల్సి వచ్చింది. పొత్తుల వలన కొన్ని సీట్లు తలకిందులు అయ్యాయి. కొందరిని అకామిడేట్ చేయలేకపోయాము. నరసాపురం సీటు బీజేపీకి వెళ్లడం వలన సమస్య అయింది. ఉండి ఎమ్మెల్యే రామరాజుపై ఎలాంటి వివక్ష లేదు. ఏవిధంగా రామరాజుకు న్యాయం చేయాలనేది ఆలోచిస్తున్నాము. కార్యకర్తలకు చెప్పాలని పిలిచాము. రామరాజు.. రఘురామలకు న్యాయం చేయాలి. రాష్ట్రానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. రామరాజు మొన్నటి ఎన్నికల్లో బాగా పనిచేశారు. ఇప్పుడు కూడా బాగా చేసాడు. రఘురామ జగన్ బాధితుడు. నాలాంటి వ్యక్తి కూడా జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. ఇలా అందరినీ జైల్లో పెట్టి అధికారం చెలాయించాలని జగన్ ప్లాన్ చేస్తున్నాడు. పార్టీని నమ్ముకున్న రామరాజును న్యాయం చేస్తాం. నేను నమ్మిన నాయకులు, కార్యకర్తలను వదులుకోను. మధ్యాహ్నం బీజేపీనీ కలుస్తున్నాం. కో ఆర్డినేషన్ పై చర్చించుకుంటున్నాము. రఘురామ జగన్ బాధితుడు. ప్రజలు కూడా ఆయనకు న్యాయం జరగాలని ఆశిస్తున్నారు. కార్యకర్తలు అర్థం చేసుకుని సంయమనం పాటించాలి.’ అని చంద్రబాబు సూచించారు.

Latest News

 
క్లాప్ ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలి: సీఐటీయూ Sun, Oct 27, 2024, 12:47 PM
విశాఖ పోలీసుల‌కు చుక్క‌లు చూపిస్తున్న జాయ్ జ‌మీమా Sun, Oct 27, 2024, 12:39 PM
అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్ Sun, Oct 27, 2024, 12:21 PM
బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు Sun, Oct 27, 2024, 11:57 AM
ఏపీలో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు Sun, Oct 27, 2024, 11:53 AM