ఈ నెల 21, 22 తేదీల్లో వీఐపీ దర్శనాలు రద్దు

by సూర్య | Sun, Mar 19, 2023, 10:20 PM

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 21, 22 తేదీల్లో తిరుపతి శ్రీవారి ఆలయంలో వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ క్రమంలో ఎలాంటి సిఫారసు లేఖలను స్వీకరించబోమని తెలిపారు. ఈ నెల 22న తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం జరగనుంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం, 6 గంటలకు మలయప్ప స్వామికి శ్రీదేవి భూదేవి అలంకారం చేస్తారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య శ్రీవారు విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగుతూ ఆలయంలోకి ప్రవేశిస్తారు. బంగారు వాకిలిలో ఆగమ పండితులు, పురోహితులు ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Latest News

 
సీఎం జగన్ పై రాయి విసిరిన అఘంతకుడు Sat, Apr 13, 2024, 09:53 PM
దేవాదాయ శాఖ సిబ్బందికి ఎన్నికల విధులు అప్పగించవద్దు Sat, Apr 13, 2024, 09:47 PM
వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయి Sat, Apr 13, 2024, 09:46 PM
రాజధానిని ముక్కలు చేసిన ఘనత జగన్ కే దక్కింది Sat, Apr 13, 2024, 09:45 PM
సీఎం జగన్ కి ప్రజలలోనుండి అభివాదం చేసిన వైయస్.భారతి Sat, Apr 13, 2024, 09:45 PM