ఈ నెల 21, 22 తేదీల్లో వీఐపీ దర్శనాలు రద్దు

by సూర్య | Sun, Mar 19, 2023, 10:20 PM

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 21, 22 తేదీల్లో తిరుపతి శ్రీవారి ఆలయంలో వీఐపీ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ క్రమంలో ఎలాంటి సిఫారసు లేఖలను స్వీకరించబోమని తెలిపారు. ఈ నెల 22న తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం జరగనుంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం, 6 గంటలకు మలయప్ప స్వామికి శ్రీదేవి భూదేవి అలంకారం చేస్తారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య శ్రీవారు విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగుతూ ఆలయంలోకి ప్రవేశిస్తారు. బంగారు వాకిలిలో ఆగమ పండితులు, పురోహితులు ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Latest News

 
తక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థి సూసైడ్ Wed, Apr 23, 2025, 08:15 PM
ఏపీలో అతి పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్‌,,,, గుజరాత్ వెళ్లొచ్చిన బృందం Wed, Apr 23, 2025, 07:46 PM
మెకానిక్ క్రియేటివిటీకి రైతులు ఫిదా..బైక్‌‌ను మినీ ట్రాక్టర్‌గా మార్చేశాడు Wed, Apr 23, 2025, 07:41 PM
వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. మరో షాక్ Wed, Apr 23, 2025, 07:35 PM
రైల్వేస్టేషన్‌లో బ్యాగ్.. అనుమానంతో ఆగిన పోలీస్ లియో డాగ్ Wed, Apr 23, 2025, 07:31 PM