మహిళల పట్ల ఇంకెన్నాళ్లు ఈ వివవివక్ష

by సూర్య | Sun, Mar 19, 2023, 07:47 PM

మహిళా సాధికారిత, సమానత్వం మాటలకే పరిమితమవుతోంది. పని ఎవరు చేసినా ఒక్కటే. మరి వేతనం దగ్గరకు వచ్చే సరికి మహిళల పట్ల వివక్ష ఎందుకు...? కంపెనీలు, కాంట్రాక్టర్లు ఈ విషయంలో ఇదే వైఖరి ప్రదర్శిస్తుండడాన్ని ఇప్పటి వరకు ఎన్నో సర్వేలు ఎత్తి చూపించాయి. జాతీయ గణాంక కార్యాలయం తాజాగా విడుదల చేసిన నివేదిక కూడా ఇదే విషయాన్ని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది. 2022 సంవత్సరానికి సంబంధించి సర్వే ఫలితాలను ప్రకటించింది. 


2022 ఏప్రిల్-జూన్ కాలంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పురుషులతో పోలిస్తే మహిళలకు ఇస్తున్న వేతనం 50 శాతం నుంచి గరిష్టంగా 93.7 శాతంగా ఉంది. మహిళలకు గ్రామీణ ప్రాంతాల్లో సగం, సగం కంటే కొంచెం ఎక్కువే వేతనం ఉండడం గమనించొచ్చు.   2011 జూలై నుంచి 2012 జూన్ వరకు జాతీయ గణాంక కార్యాలయం నివేదికలోని (పదేళ్ల క్రితం నివేదిక) అంశాలతో పోల్చినప్పుడు... గ్రామీణ ప్రాంతాల్లో పురుషులతో పోలిస్తే మహిళలకు చెల్లించే వేతనం పరంగా అంతరం పెరిగింది. కాకపోతే పట్టణ ప్రాంతాల్లో వేతన చెల్లింపుల పరంగా వ్యత్యాసం కొంత తగ్గడం సంతోషించాల్సిన విషయం.


కేరళలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ అంతరం ఎక్కువగా ఉంది. ఈ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో పురుషులకు సగటు రోజువారీ వేతనం రూ.842గా ఉంది. దేశంలో ఇదే గరిష్ఠ స్థాయి. కానీ, ఇదే రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు చెల్లించే సగటు రోజువారీ వేతనం రూ.434. అంటే పురుషులు పొందుతున్న వేతనంలో మహిళలకు వస్తున్నది 51.5 శాతమే. పెద్ద రాష్ట్రాల్లోనే ఈ అంతరం ఎక్కువగా ఉన్నట్టు సర్వే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 


కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో పురుషుల రోజువారీ వేతనం మహిళలతో పోలిస్తే ఎంతో ఎక్కువగా ఉంది. పురుషులు పొందే వేతనంలో మహిళలకు 60 శాతం మించడం లేదు. 


యూపీ, అసోం, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశాలోని గ్రామీణ పురుషులతో పోలిస్తే మహిళలకు 70 శాతం వరకు వేతనం లభిస్తోంది. హర్యానా, రాజస్థాన్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మహిళల కంటే రోజువారీగా పురుషులకు రూ.400 వరకు అధిక వేతనం లభిస్తోంది. జార్ఖండ్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వేతన వివక్ష తక్కువగా ఉంది. పురుషులతో పోలిస్తే మహిళలు 80 శాతం వరకు పొందుతున్నారు.


Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM