ప్రభుత్వంపై ప్రజా తిరుగుబాటుకు ఇది నిదర్శనం: చంద్రబాబు

by సూర్య | Sun, Mar 19, 2023, 03:55 PM

పట్టభద్రుల ఎన్నికల్లో రాంగోపాల్ రెడ్డి గెలుపు ప్రజావిజయం అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. ప్రజాతీర్పును ప్రభుత్వంపై తిరుగుబాటుగా చూడాలని పేర్కొన్నారు. రాష్ట్రం ఏం నష్టపోయిందో ప్రజలు గమనించారని చంద్రబాబు వివరించారు. చైతన్యం, బాధ్యతతో వచ్చి ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేశారని తెలిపారు. ఉగాది పంచాంగాన్ని ప్రజలు రెండ్రోజులు ముందే చెప్పారని చంద్రబాబు చమత్కరించారు. 


ఈ నాలుగేళ్లలో జగన్ విధ్వంస పాలన చేశారని విమర్శించారు. జగన్ ఎన్నికల్లో మళ్లీ గెలిచే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. జగన్ బాధ్యతలేని వ్యక్తి అని, మోసాలు చేయడంలో దిట్ట అని పేర్కొన్నారు. తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ, టీడీపీది జనబలం అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. జగన్ ది ధనబలం అని, రౌడీయిజం చూపిస్తున్నాడని... ఇవి ఎప్పటికీ శాశ్వతం కాదని అన్నారు. జగన్ అక్రమాలను నమ్మి వాటితోనే ముందుకు వెళుతున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్ని అవకతవకలకు పాల్పడాలో అన్నీ చేశారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు మాట్లాడితే కేసులు పెట్టి వేధించారని తెలిపారు.


Latest News

 
తప్పుడు ప్రచారం ఆపి, అభివృద్ధి దిశగా ముందుకువెళ్ళండి Mon, Jun 17, 2024, 05:19 PM
‘ప్రజాదర్బార్’లో వినతులు వెల్లువ Mon, Jun 17, 2024, 05:19 PM
ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం Mon, Jun 17, 2024, 05:18 PM
ఈనెల 19న జగన్ అధ్యక్షతన సమావేశం Mon, Jun 17, 2024, 05:17 PM
మహిళలకు అన్యాయం జరగకుండా చూసుకుంటా Mon, Jun 17, 2024, 05:17 PM