సెల్పాయింట్ దుకాణాల నిర్వాహకుల సమావేశం

by సూర్య | Sun, Mar 19, 2023, 10:14 AM

హిందూపురం పట్టణ పరిధిలోని సెల్పాయింట్, హోల్సేల్ దుకాణ యజమానులు సమావేశంను శనివారం స్థానిక ఏఎంఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా సెల్ పాయింట్ నిర్వహుకులు మాట్లాడుతూ పట్టణంలో దాదాపు 200 కుటుంబాలు చిన్న సెల్పాయింట్ నిర్వహిస్తూ పొట్టపోసుకుంటున్నారు. యూనియన్ నిబంధనలు ప్రకారం హోల్సేల్ వ్యాపారులు సెల్ఫోన్లు రిటైల్ అమ్మకూడదు, రిపేరీలు చేయకూడదని నిబంధనలు ఉందన్నారు. అయితే హోల్ సేల్ వ్యాపారులు ఫోన్ రిపేరీలు చేయడమే కాకుండా రిటైల్ వ్యాపారం కూడా చేస్తున్నారన్నారు. దీంతో చిన్న పాటి వ్యాపారం కూడా లేకుండా వందలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన చెందారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీం, బద్రి, చంద్ర, ఉమేష్, వెంకటేశ్, ముసవ్వీర్, నూరుల్లా వందలాది మంది సెల్ పాయింట్ నిర్వాహకులు, యజమానులు పాల్గొన్నారు.

Latest News

 
చంద్రబాబు అమరావతికి ఏం చేశారో చెప్పాలి...సజ్జల ప్రశ్న Fri, Mar 31, 2023, 10:01 PM
ఏపీ సీఎం జగన్ కీలక ఆదేశాలు Fri, Mar 31, 2023, 08:56 PM
బీజేపీ నేత సత్యకుమార్‌పై దాడి సరికాదు : పవన్‌ కల్యాణ్‌ Fri, Mar 31, 2023, 08:48 PM
ప్రధాని మోడీకి లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణరాజు Fri, Mar 31, 2023, 08:34 PM
మేం కూడా భౌతికదాడులకు సిద్దం: బీజేపీ నేత సత్యకుమార్ Fri, Mar 31, 2023, 07:34 PM