సత్యసాయి కార్మికుల సమస్యల పరిష్కారం లొ విఫలం

by సూర్య | Sun, Mar 19, 2023, 10:11 AM

శ్రీ సత్యసాయి నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిఐటియు రాష్ట్ర నాయకులు జి. ఓబులు విమర్శించారు. శనివారం స్థానిక ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో సత్యసాయి వాటర్‌ సప్లరు పథకం కింద దాదాపు 22 ఏళ్లుగా 572 మంది కార్మికులు 750 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నారన్నారు. అలాంటి కార్మికుల సమస్యలను ప్రభుత్వం పెడచెవిన పెట్టి చోద్యం చూడటం బాధాకరమన్నారు. ముఖ్యంగా 5 నెలల బకాయి జీతాలు, పీఎఫ్‌, ఇఎస్‌ఐ బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అలాగే ఈ పథకాన్ని విభజించి ముక్కలు చేసి అధికార పార్టీ కార్యకర్తలకు ఉపాధిగా అందించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకించాలన్నారు. మార్చి నుంచి వేతనాలు పెంచాలని, కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి రెగ్యులరైజ్‌ చేయాలని, ప్రతినెలా 5వతేదీలోగా వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM