తనను ఎలాగైనా అరెస్ట్ చేయించాలన్నకుట్ర: ఇమ్రాన్ ఖాన్

by సూర్య | Sat, Mar 18, 2023, 09:23 PM

తనను ఎలాగైనా అరెస్ట్ చేయించాలన్నకుట్ర  జరిగిందని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్  పేర్కొన్నారు. ఇదిలావుంటే ఇమ్రాన్ ఖాన్ కు న్యాయస్థానంలో ఊరట లభించింది. 9 కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పిస్తూ ఇస్లామాబాద్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో తోష్ ఖానా అవినీతి కేసు కూడా ఉంది. ఇదిలావుంటే ఇవాళ ఇమ్రాన్ ఖాన్ లాహోర్ నుంచి ఇస్లామాబాద్ లోని హైకోర్టుకు వెళుతుండగా, ఆయన కాన్వాయ్ లోని ఓ వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. దాంతో ఆయన కోర్టుకు వెళ్లడం ఆలస్యమైంది. తనను ఎలాగైనా అరెస్ట్ చేయించాలన్న పన్నాగంలో భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. ఎన్నికల్లో తన పార్టీకి నాయకత్వం వహించకుండా చేయడమే ఈ కుట్ర వెనుక ప్రధాన ఉద్దేశం అని అన్నారు. అటు, ఇమ్రాన్ ఖాన్ ను అరెస్ట్ చేసేందుకు గత మూడ్రోజులుగా కాచుకుని ఉన్న పోలీసులు లాహోర్ లో ఇమ్రాన్ ఖాన్ ఇంటి గేటును ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు. అయితే, ఇమ్రాన్ ఖాన్ అప్పటికే హైకోర్టుకు పయనమయ్యారు.


Latest News

 
బైకులు ఎత్తుకెళ్తున్న దొంగలు అరెస్టు Fri, Mar 29, 2024, 01:41 PM
42 ఏళ్లుగా ప్రజా సేవలో టిడిపి: ఎమ్మెల్యే ఏలూరి Fri, Mar 29, 2024, 01:39 PM
ఎన్నికల నిబంధనలకు తిలోధకాలు.. అధికారుల పర్యవేక్షణ ఎక్కడ? Fri, Mar 29, 2024, 01:38 PM
టీడీపీ లో చేరిన ప్రముఖ వైద్యులు రామయ్య నాయుడు Fri, Mar 29, 2024, 01:36 PM
వివేక హత్య కేసు దోషులను కఠినంగా శిక్షించాలి Fri, Mar 29, 2024, 01:36 PM