రేపు విశాఖలో వన్డే మ్యాచ్,,,ట్రాఫిక్ పై ఆంక్షలు

by సూర్య | Sat, Mar 18, 2023, 08:07 PM

రేపు జరిగే ఇండియా, ఆస్ట్రేలియా మధ్య రేపు జరగబోయే వన్డే క్రికెట్ మ్యాచ్ పై ఆసక్తి నెలకొంది. ఇదిలావుంటే ఈ మ్యాచ్ సందర్భంగా విశాఖపట్నంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం రోజు.. విశాఖ నుంచి శ్రీకాకుళం వెళ్లే బస్సులు, గూడ్స్ వాహనాలు హనుమంతవాక, అడవివరం మీదుగా దారి మళ్లింపు ఉంటుందని పోలీసులు తెలిపారు. విశాఖ నుంచి శ్రీకాకుళం వైపు వెళ్లా కార్లు, టూ వీల్లర్లు హనుమంతవాక నుంచి విశాలాక్షినగర్, బీచ్ రోడ్ మీదుగా మళ్లించనున్నారు. శ్రీకాకుళం నుంచి వచ్చే బస్సులు.. మారికవలస నుంచి బీచ్ రోడ్డు మీదుగా తెన్నేటి పార్క్, విశాలాక్షి నగర్ మీదుగా నగరంలోకి అనుమతించనున్నారు. శ్రీకాకుళం నుంచి అనకాపల్లికి, అనకాపల్లి నుంచి శ్రీకాకుళం వెళ్లే భారీ వాహనాలు ఆనందపురం, పెందుర్తి వైపు మళ్లించనున్నారు. వాహనదారులు వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రయాణాలు సాగించాలని ప్రజలను పోలీసులు కోరుతున్నారు.


విశాఖ సిటీ నుంచి క్రికెట్ స్టేడియంకు వెళ్లే వీఐపీ, వీవీఐపీ వాహనాలకు బీ స్టేడియంతో పాటు వైజాగ్ కన్వెన్షన్ సెంటర్ వద్ద పార్కింగ్ కేటాయించారు. విశాఖ నుంచి వచ్చే వాహనాలకు సాంకేతిక కాలేజీ వద్ద పార్కింగ్ సదుపాయం కల్పించారు. ఆ‌‌న్‌లైన్‌లో టికెట్లు మార్చుకునేందుకు సాంకేతిక కాలేజీ వద్ద కౌంటర్ ఏర్పాటు చేశారు. ఆనందపురం నుంచి క్రికెట్ టికెట్ హోల్డర్ల కోసం సాంకేతిక కాలేజీ వద్ద ఎంవీవీ సిటీ వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించారు.  మరోవైపు.. ఇప్పటికే ఇండియా, ఆస్ట్రేలియా ప్లేయర్లు విశాఖకు చేరుకున్నారు. మ్యాచ్‌పై వర్ష ప్రభావం ఉండటంతో.. గ్రౌండ్‌ను ఏసీఏ సిబ్బంది కవర్లతో కప్పారు.


Latest News

 
గంటకు 280 కిలోమీటర్ల వేగంతో భారత తొలి బుల్లెట్ రైలు Fri, Sep 20, 2024, 10:38 PM
సింహాచలం అప్పన్నకు హైదరాబాద్ భక్తుడి భారీ విరాళం Fri, Sep 20, 2024, 10:18 PM
తిరుపతి లడ్డూ నెయ్యి వివాదం వేళ కర్ణాటక సర్కార్ సంచలన నిర్ణయం Fri, Sep 20, 2024, 10:16 PM
విజయవాడలో వెరైటీ దొంగ.. ఆ టైంలో మాత్రమే చోరీలు Fri, Sep 20, 2024, 10:13 PM
ఏపీ రైతులకు.. అక్టోబర్ ఒకటి నుంచే మొదలు Fri, Sep 20, 2024, 10:01 PM