ఆ వార్తల్లో నిజం లేదు.... షల్ మీడియాలో ప్రచారం.. ఫ్యాక్ట్ చెక్ క్లారిటీ

by సూర్య | Sat, Mar 18, 2023, 08:05 PM

ఏపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు సాగిందని చెప్పవచ్చు. ఇదిలావుంటే ఈ ఎన్నికలల్లో టీడీపీ రెండు స్థానాల్లో విజయం సాధించింది. తూర్పు రాయలసీమ స్థానం నుంచి కంచర్ల శ్రీకాంత్.. ఉత్తరాంధ్ర స్థానం నుంచి వేపాడ చిరంజీవిరావు గెలిచారు. ఇక మిగిలిన పశ్చిమ రాయలసీమ స్థానంలో హోరా హోరీగా కౌంటింగ్ సాగుతుండగా.. రెండో ప్రాధాన్యతా ఓట్ల లెక్కింపు జరుగుతోంది. దీంతో అందరి కళ్లు ఆ ఫలితం వైపు మళ్లింది.


ఈ క్రమంలో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓ ప్రచారం ఇప్పుడు వైరల్ అవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో అధికార వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కంటే టీడీపీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో పోస్టులు, ట్వీట్‌లు వైరల్ అవుతున్నాయి.. దీంతో ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌ చెక్‌ విభాగం స్పందించింది. ఆ ప్రచారం వాస్తవం కాదని క్లారిటీ ఇచ్చింది. సోషల్‌ మీడియాలో జరుగుతున్న ఈ వాదన పూర్తిగా నిరాధారమని తేల్చి చెప్పింది.


ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి క్లారిటీ ఇచ్చింది ఫ్యాక్ట్ చెక్ విభాగం. ఎమ్మెల్యే ఎన్నికల కౌంటింగ్‌లా నియోజకవర్గాల వారీగా జరగదని గుర్తుచేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విడివిడిగా కాకుండా పోలైన ఓట్లన్నీ కలిపే లెక్కిస్తారని.. త్వరలో ఎన్నికల సంఘం తుది వివరాలను ప్రకటిస్తుందని, అసత్య వార్తలను నమ్మొద్దని కోరింది ఫ్యాక్ట్ చెక్ విభాగం. మరోవైపు పులివెందులతో పాటూ కుప్పం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలంటూ పోస్టులు ఇలా వైరల్ అవుతున్నాయి.


కుప్పం లో వచ్చిన ఓట్లు...


TDP - 5,528


YCP - 1,090


పులివెందుల లో వచ్చిన ఓట్లు...


టీడీపీ కి 4,323 ఓట్లు,


వైసీపీ కి 2,120 ఓట్లు,


కుప్పం మాదే పులివెందుల మాదే అంటూ టీడీపీ శ్రేణులు ట్వీట్లు, పోస్టులు పెడుతున్నారు.  అలాగే టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్లు బుచ్చయ్య చౌదరి కూడా దీనిపై ట్వీట్ చేశారు.


జగన్ కి భారీ షాక్ ఇచ్చిన పులివెందుల పట్టభద్రులు...!!


TDP -4,323


YSRCP- 2,120


ఇతరులు - 123


మరోవైపు ఏపీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ స్థానాల్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ఇంకా కొనసాగుతోంది.. రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపు నడుస్తోంది.


Latest News

 
విద్యాశాఖపై వస్తున్న కథనాలు నిరూపించాలి Fri, Apr 26, 2024, 06:14 PM
నెల్లూరులో దుర్మార్గం రౌడీయిజాలకు స్థానం లేకుండా చేస్తా Fri, Apr 26, 2024, 06:13 PM
చంద్రబాబు,లోకేష్,పవన్ కల్యాణ్ ప్రస్టేషన్లో మాట్లాడుతున్నారు Fri, Apr 26, 2024, 06:12 PM
చంద్రబాబు,లోకేష్,పవన్ కల్యాణ్ ప్రస్టేషన్లో మాట్లాడుతున్నారు Fri, Apr 26, 2024, 06:12 PM
దుష్ప్రచారం చేయడం చంద్రబాబుకి అలవాటే Fri, Apr 26, 2024, 06:12 PM