శ్రీకాకుళం విద్యార్థుల కష్టాలు

by సూర్య | Fri, Jan 27, 2023, 02:48 PM

శ్రీకాకుళంలోని పెద్దపాడు నుంచి శ్రీకాకుళం ఓ.బి.సి మీదుగా బస్ సౌకర్యం నిలిపివేసి మూడు సంవత్సరాల కాలం గడిచినా, ఇంకా బస్ సౌకర్యం ప్రారంభించకపోవడం వల్ల శ్రీకాకుళం పట్టణంలో చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతూ, కాలేజీలకు, స్కూళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది. శ్రీకాకుళం పట్టణంలో 80% విద్యా సంస్థలు విశాఖ ఎ కాలనీ నుంచి, పాత బస్ స్టాండ్ మీదుగానే ఉండటం గమనార్హం. విద్యార్థులు బస్ పాసులు ఉండి కూడా ఆటోలలో వెళ్లాల్సిన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. విద్యార్థులు ఈ సమస్య మీద చాలా సార్లు అధికారులకు తెలియజేయగా, ప్రభుత్వ అధికారులు, ఆర్ టి సి అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదని తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా పెద్దపాడు మీదుగా రామలక్ష్మణ కూడలికి, శ్రీకాకుళం పాత బస్ స్టాండ్ కు ఆర్ టి సి బస్ సర్వీసులు ప్రారంభించాలని విధ్యారులతో పాటు పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM