రాజకీయాల్లో ప్రత్యర్థులను కాకాణి శత్రువులుగా చూస్తున్నారు: సోమిరెడ్డి

by సూర్య | Wed, Jan 25, 2023, 11:45 PM

నెల్లూరు కోర్టులో చోరీ కేసులో161 స్టేట్మెంట్ తీసుకున్నారని టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు చెప్పానని.. పరువు నష్టం కేసుకి సంబంధించి సివిల్, క్రిమినల్ కేసుల్లో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి శిక్ష తప్పదని జోస్యం చెప్పారు. రాజకీయాల్లో ప్రత్యర్థులను కాకాణి శత్రువులుగా చూస్తున్నారని ఆరోపించారు. మంత్రి కాకాణిపై నకిలీ మద్యం, నకిలీ పత్రాలు, మార్ఫింగ్, భూ వివాదం వంటి కేసులు ఉన్నాయని సోమిరెడ్డి అన్నారు. గతంలో చాలా మంది రాజకీయ నేతలతో పోరాడామని.. కానీ, ఎవరి వ్యక్తిగత గౌరవాన్ని కించపరిచేలా చేయలేదన్నారు. నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో కాకాణి మాత్రమే ఇలా చేశారని ఫైరయ్యారు.

Latest News

 
అఫిడవిట్ దాఖలు చేయండి... భారతీ సిమెంట్స్‌కు కోర్టు ఆదేశాలు Tue, Feb 07, 2023, 12:33 AM
పార్టీ అదేశించినచోటు నుంచే పోటీ: సినీ నటుడు అలీ Tue, Feb 07, 2023, 12:13 AM
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM