ఉందిగా మార్గం... ఆ తప్పులను ఇలా సరిచేసుకోండి

by సూర్య | Wed, Jan 25, 2023, 11:36 PM

తప్పులను సరిదిద్దుకోవడానికి అనేక మార్గాలుంటాయి. పాన్ కార్డులోని తప్పులను సరిచేసుకోవడానికి కూడా ఓ మార్గముంది. ఆదాయ పన్ను శాఖ జారీ చేసే పాన్ కార్డు సైతం ఆధార్ కార్డు మాదిరిగానే చాలా కీలకమైన డాక్యుమెంట్. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి, బ్యాంకులో అధిక విలువ కలిగిన లావాదేవీలు నిర్వహించడానికి పాన్ కార్డు అవసరం అవుతుంది. బ్యాంకు ఖాతా తెరవాలన్నా, రుణాలు, క్రెడిట్ కార్డులు తీసుకోవాలన్నా పాన్ కార్డు తప్పనిసరిగా అడుగుతారు. మరి ఇంత ముఖ్యమైన ఈ పాన్ కార్డులో వివరాలు తప్పుగా ఉంటే ఇబ్బందులు ఎదురవుతుంటాయి. వాటిని ఎలా సరిచేసుకోవాలో తెలియక చాలా మంది సతమతమవుతుంటారు. కానీ, తప్పుగా ఉన్న వివరాలను సులభంగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల్లో ఇంటి నుంచే అప్‌డేట్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఆ ప్రక్రియ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


పాన్ కార్డు నమోదు చేసేటప్పుడు పేరు తప్పుగా రిజిస్టర్ కావడం అనేది సాధారణంగా జరిగే విషయం. అలాగే కార్డుపై వేరొకరి ఫోటో వస్తుంటుంది. పుట్టిన తేదీ, తండ్రి పేరు తప్పుగా రాయడం, అడ్రస్‌లో తప్పులు వంటివి కనిపిస్తుంటాయి. ఇలాంటి సందర్భాల్లో సంబంధిత అధికారికి తెలియజేసి కార్డులోని వివరాలను సవరించుకోవాల్సి ఉంటుంది.


వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు..


ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారిక వెబ్‌సైట్ లోకి లాగిన్ కావాలి


పన్ను చెల్లింపుదారుల సేవల ఆప్షన్ ఎంచుకోవాలి


ఆ తర్వాత పాన్ గ్రీవెన్స్ సెక్షన్‌కు వెళ్లాలి


ఆ తర్వాత మీ ఫిర్యాదుతో పాటు సంబంధిత సమాచారం (పేరు, పాన్ నంబర్, వ్యక్తిగత వివరాలు, ఈ-మెయిల్ ఐడీ) వంటివి ఇవ్వాలి.


ఆఫ్‌లైన్ ద్వారా ఫిర్యాదులు మీ పాన్ కార్డులోని తప్పులను సవరించేందుకు ఆఫ్‌లైన్ ద్వారా ఇన్‌కమ్ ట్యాక్స్ హెల్ప్ డెస్క్ 18001801961 లేదా TIN Protean eGov టెక్నాలజీస్ లిమిటెడ్ కాల్ సెంటర్ 91 2027218080కు కాల్ చేసి ఫిర్యాదులను నమోదు చేయాలి. ఆ తర్వాత మీకు ఓ నంబర్ ఇస్తారు. మీ ఫిర్యాదు స్టేటస్ తెలుసుకునేందుకు కంప్లైంట్ నమోదు చేసిన పోర్టల్‌లో ఫిర్యాదు నంబర్, పాన్ నంబర్ ఎంటర్ చేస్తే తెలిపోతుంది.


Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM