కల్‌ రోడ్డుపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం,,,ఐదుగురి దుర్మరణం

by సూర్య | Wed, Jan 25, 2023, 09:35 PM

దైవ దర్శనానికి వెళ్తున్న భక్తులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం కాణిపాకం వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఐదుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కల్‌ రోడ్డుపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ గోడను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొక వ్యక్తి మృతి చెందాడు. ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులందరూ మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.


గాయపడిన వారిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తిరుపతి అడిషనల్ ఎస్పీ కులశేఖర్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.


జనవరి 23న మహారాష్ట్రలోని సోలాపూర్ నుంచి 9 మంది మిత్రులు తిరుపతికి వచ్చారు. నిన్న తిరుమలలో స్వామి వారి దర్శనం చేసుకొని, నేడు కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ సందర్శనార్థం బయల్దేరారు. మార్గమధ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో మృతి చెందిన వారిని ఆనంత్ తెంబుకర్, మయూర్ మట్‌పతి, రిషికేష్ జంగం, అజయ్ నంగనాద్‌గా గుర్తించారు. వారి బంధువులకు ఫోన్ చేసి సమాచారం అందించారు.

Latest News

 
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలో ట్విస్ట్.. వారికి మాత్రమే..! Thu, Dec 12, 2024, 12:20 PM
ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐడీ మాజీ అదనపు ఎస్పీ విజయపాల్ Wed, Dec 11, 2024, 10:52 PM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు పోలవరం పర్యటనకు వెళుతున్నారు Wed, Dec 11, 2024, 10:04 PM
మార్చి 17 నుంచి టెన్త్ పరీక్షలు ప్రకటన చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ Wed, Dec 11, 2024, 09:55 PM
ఏపీలో ట్రాఫిక్ నిబంధనల అమలులో నిర్లక్ష్యం కనిపిస్తోందన్న హైకోర్టు Wed, Dec 11, 2024, 09:51 PM