మార్కెట్ అంత అక్రమమే

by సూర్య | Wed, Jan 25, 2023, 03:19 PM

గుంతకల్లు  పట్టణంలోని కూరగాయల మార్కెట్‌లో దుకాణాలతో కొందరు ‘వ్యాపారం’ చేస్తున్నారు. మున్సిపాలిటీకి నామమాత్రపు రుసుము చెల్లించి, వాటిని వేలాది రూపాయలకు అద్దెకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు. దీంతో మున్సిపాలిటీ ఆదాయానికి రూ.లక్షల్లో గండి పడుతోంది. పట్టణంలోని కూరగాయల మార్కెట్‌లో దాదాపు 30 సంవత్సరాల క్రితం మున్సిపల్‌ అధికారులు షెడ్‌లను నిర్మించారు. కూరగాయల వ్యాపారం చేసుకునేందుకు 72 షెడ్‌లను అద్దెకు ఇచ్చారు. అద్దె తీసుకున్నవారు రోజుకు ఒక్కో షెడ్‌కు రూ.30 మున్సిపాలిటీకి సుంకం చెల్లిస్తున్నారు. షెడ్లను దక్కించుకున్న కొందరు.. చికెన సెంటర్లు, హోటళ్లు, కిరాణం దుకాణాలు, ఫైనాన్స వ్యాపారులకు అద్దెకు ఇచ్చారు. నెలకు రూ.3 వేల నుంచి రూ.10 వేలు వసూలు చేసుకుంటున్నారు. మరికొంత మంది బడా బాబులు పదుల సంఖ్యలో ఖాళీ స్థలాలను ఆక్రమించుకున్నారు. అక్కడ బండలు నాటి, రేకుల షెడ్లను వేసి, ఇతరులకు అద్దెకు ఇచ్చి, నెలనెలా రూ.వేలు సంపాదిస్తున్నారు. మరికొంత మంది గుడ్‌విల్‌ కింద రూ.లక్ష నుంచి రూ.3 లక్షలకు షెడ్‌లను అమ్ముకుంటున్నారు. ఇలా అనేక మార్గాల్లో ప్రైవేటు వ్యక్తులు సొమ్ము చేసుకుంటుంటే.. మున్సిపాలిటీ అధికారులు పట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికైనా మున్సిపల్‌ అధికారులు స్పందించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM