పలు రైళ్ల దారి మళ్లింపు

by సూర్య | Wed, Jan 25, 2023, 02:14 PM

సెంట్రల్ రైల్వేలోని కోపర్గావ్ స్టేషన్ వద్ద జరుగుతున్న ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా గుంతకల్లు రైల్వే డివిజన్ మీదుగా వెళ్లే పలు రైళ్లను దారిమళ్లింస్తున్న కారణంగా ఆల స్యంగా నడుపుతున్నట్లు మంగళ వారం రైల్వే అధికారులు తెలిపారు. బెంగళూరు-ఢిల్లీ మధ్యన నడిచే కర్ణాటక సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (నెం. 12627)ను 27న పూణే - సంత్ హిర్థరాంనగర్ స్టేషన్ల మీదుగా, హజ్రత్ నిజాముద్దీన్- యశ్వంత్ పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (నెం. 12630)ను ఈనెల 27 సంత్ హిర్థరాంనగర్ -పూణే స్టేషన్ల మీదుగా మళ్లిస్తున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా బెంగళూరు- ఢిల్లీ మధ్యన నడుస్తున్న కేకే ఎక్స్ ప్రెస్ (నెం. 12628)ను ఈ నెల 24, 25, 26, 27 తేదీలలో వరుసగా 45, 90, 105, 110 నిమిషాలు ఆలస్యంగా నడుపుతున్నట్లు తెలిపారు. అదే విధంగా వారణాసి-మైసూరు బై వీక్లి ఎక్స్ ప్రెస్ (నెం. 22688)28వ తేదీన గంట ఆలస్యంగా నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు.

Latest News

 
అఫిడవిట్ దాఖలు చేయండి... భారతీ సిమెంట్స్‌కు కోర్టు ఆదేశాలు Tue, Feb 07, 2023, 12:33 AM
పార్టీ అదేశించినచోటు నుంచే పోటీ: సినీ నటుడు అలీ Tue, Feb 07, 2023, 12:13 AM
ఆ రోజు మాత్రం ఈ ఊరంతా ఖాళీ Tue, Feb 07, 2023, 12:00 AM
నర్స్ సోదరీముణులంటే నాకెంతో గౌరవం: బాలకృష్ణ Mon, Feb 06, 2023, 11:44 PM
ఎలాంటి ష్యూరిటీ లేకుండానే అదానీకి ఎలా రుణం ఇచ్చారు: చింతామోహన్ Mon, Feb 06, 2023, 11:42 PM