మావోయిస్టుల ఆంధ్రా-ఒడిసా స్పెషల్‌ జోన్‌ కమిటీ

by సూర్య | Thu, Nov 24, 2022, 11:18 AM

ఒడిసాలో దొరికిన మావోయిస్టు డంప్‌లో ఈవీఎం ఉండడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఈవీఎం మావోయిస్టులకు ఎందుకు? దీన్ని ఎక్కడ నుంచి తెచ్చారు? అని ఒడిసా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒడిసా రాష్ట్రం మల్కనగిరి జిల్లా కటాఫ్‌ ఏరియా ఏవోబీలోని జోడాంబ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోకి వచ్చే ధ్కాడ్‌పొదర్‌ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌ దొరికినట్టు మల్కనగిరి పోలీసులు బుధవారం వెల్లడించారు. మావోయిస్టుల ఆంధ్రా-ఒడిసా స్పెషల్‌ జోన్‌ కమిటీకి చెందిన ఈ డంప్‌ సోమవారం సాయంత్రం లభ్యమైనట్టు వారు వెల్లడించారు. ఈ డంప్‌లో ఎన్నికల్లో వినియోగించిన అభ్యర్థుల పేర్లు, గుర్తులతో ఉన్న ఈవీఎం కూడా ఉంది. తుపాకీ, టెలిస్కోప్‌, మందుపాతర్లు, పిస్తోలు, పైప్‌ క్లెమోర్‌ ఐఈడీ మేకింగ్‌, గ్రనేడ్లు తదితర వస్తువులు ఉన్నాయి.

Latest News

 
అతిధికి పట్టుచీర కానుకగా సమర్పించిన సీఎం భార్య Sun, Dec 04, 2022, 09:50 PM
ఆ రెండు ప్రభుత్వాలు ప్రజలకు దగా చేశాయి: టీ.జీ. వెంకటేశ్ Sun, Dec 04, 2022, 09:49 PM
వివాహ రాకపోకల కోసం ఏకంగా విమానం బుక్ చేశారు Sun, Dec 04, 2022, 09:47 PM
రేపో, మాపో టీీడీపీని మూసివేస్తారు: మంత్రి జోగి రమేష్ Sun, Dec 04, 2022, 09:41 PM
వైసీపీలోకి గంటా శ్రీనివాస్...రాజకీయ వర్గాల్లో చర్చ Sun, Dec 04, 2022, 09:40 PM