ప్రేమ విఫలమైందని యువకుడు ఆత్మహత్యాయత్నం

by సూర్య | Thu, Nov 24, 2022, 11:17 AM

ప్రేమ విఫలమైందన్న మనస్థాపం తో ఓ యువకుడు బుధవారం ఒంగోలు  ప్రకాశంభవన్‌లో మూడో అంతస్తు నుంచి దూకేందుకు ప్రయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసు లు వేగంగా స్పందించి అతడిని కాపాడారు. వివరాల్లోకి వెళితే.. పొన్నలూరు మండలం లింగంగుంటకు చెందిన మోరబోయిన రోశయ్య మూడేళ్లగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆ అమ్మాయి తల్లిదండ్రులు అందుకు నిరాకరించారు. దీంతో మనస్తాపానికి గురైన రోశయ్య ఆత్మహత్య చేసుకునేందుకు ఒంగోలు వచ్చాడు. ప్రకాశం భవన్‌ మూడో అంతస్తు పైకి ఎక్కి వారి బంధువులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చాడు. వారు ఒంగోలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అప్రమత్తమైన టూటౌన్‌ సీఐ రాఘవరావు కలెక్టరేట్‌కు చేరుకొని పైకి ఎక్కారు. రోశయ్యతో మాట్లాడి కిందకు దించారు. అనం తరం మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని తెలుసుకున్న పోలీసులు అతనికి ఆసుపత్రిలో చికిత్స చేయించాలని చెప్పి బంధువులకు అప్పగించారు.

Latest News

 
మూడు రాజధానులకు అందరి మద్దతు ఉంది : మంత్రి గుడివాడ అమర్‌నాథ్ Sun, Nov 27, 2022, 10:21 AM
తెలంగాణ అభివృద్ధిని చూసే ఏపీ ప్రజలు ఇక్కడకు వలస వస్తున్నారు Sun, Nov 27, 2022, 12:17 AM
భారీ స్థాయిలో పోలీస్ శాఖ నియామకాలు...త్వరలోనే నోటిఫిషన్ Sun, Nov 27, 2022, 12:11 AM
జగన్ రెడ్డి ప్రజలకు, రాష్ట్రానికి ఏం ఊడబెరికాడని: అనిత Sun, Nov 27, 2022, 12:10 AM
తూర్పు కాపు సంక్షేమ సంఘం నాయకులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ Sat, Nov 26, 2022, 09:41 PM