బ్రహ్మంసాగర్‌ కాల్వలో పడి విద్యార్ధి మృతి

by సూర్య | Thu, Nov 24, 2022, 11:14 AM

బ్రహ్మంగారిమఠంలోని గురుకుల పాఠశాల విద్యార్ధి మృతికి కారణమైన వారిని సస్పెండ్‌ చేయాలని విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. బ్రహ్మంగారిమఠంలోని గురుకుల పాఠశాలలో ఇంటర్‌మీడియట్‌ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థి హర్షదీక్షిత్‌ మంగళవారం బ్రహ్మంసాగర్‌ కాల్వలో పడి మరణించిన విషయం తెలిసిందే. బుధవారం పాఠశాల వద్ద విద్యార్థి మృతదేహంతో తల్లిదండ్రులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, ఎమ్మార్పీఎస్‌, ఎంహెచ్‌ఎ్‌ఫ, ప్రజా సంఘాల నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు వీరపోగు రవి, రాహుల్‌లు మాట్లాడు తూ పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంతో మూడు నెలల వ్యవఽధిలోనే ముగ్గు రు విద్యార్థులు బలయ్యారన్నారు. విద్యార్థి మృతికి పూర్తి బాధ్యత పాఠశాల సిబ్బంది బాధ్యత వహించాలన్నారు. మృతి చెందిన హర్షదీక్షిత్‌ కుటుంబానికి ప్రభుత్వం రూ.50లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సంఘటనా స్థలానికి మైదుకూరు రూరల్‌ సీఐ నరేంద్రరెడ్డి, బి.మఠం ఎస్‌ఐ విద్యాసాగర్‌ చేరుకుని ఆందోళన కారులకు సర్ది చెప్పి అదుపు చేశారు. ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కమిటీ సభ్యు లు సుమంత్‌, మండల అధ్యక్ష, కార్యదర్శులు రాజశేఖర్‌, అజయ్‌, ఉపాధ్యక్షుడు రమేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ, ఎమ్మార్పీఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Latest News

 
పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలకు సిద్ధమైన పొన్నూరు కాలేజ్ Fri, Jul 26, 2024, 11:56 PM
గ్రామీణ రోడ్లని గుర్తించాలి Fri, Jul 26, 2024, 11:55 PM
ఉచితంగా డీస్సీ కోచింగ్‌ Fri, Jul 26, 2024, 11:54 PM
దేవుడి భూముల్ని సైతం ఆక్రమించారు Fri, Jul 26, 2024, 11:54 PM
రైతులకు న్యాయం చేస్తాం Fri, Jul 26, 2024, 11:53 PM