బస్సులోనే కాన్పు, తల్లీ బిడ్డ క్షేమం

by సూర్య | Thu, Nov 24, 2022, 11:13 AM

ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ బస్సులోనే ప్రసవించింది. డ్రైవర్‌, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.... పులివెందుల ఆర్టీసీ డిపో బస్సు బుధవారం తిరుపతి నుంచి రాయచోటి మీదుగా పులివెందులకు బయలు దేరింది. వెస్ట్‌బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన గర్భిణి ముషీద కుటుంబ సభ్యులతో కలిసి పులివెందులకు చేరుకునేందుకు తిరుపతిలో బస్సు ఎక్కారు. వేంపల్లె మండలం తాళ్లపల్లె సమీపంలోకి రాగా నే ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యా యి. సమీపంలో ఆస్పత్రి లేకపోవడం, నొప్పులు ఎక్కువ కావడంతో బస్సును డ్రైవర్‌ నేరుగా పులివెందుల ఏరియా ఆస్పత్రి వద్దకు చేర్చారు. ఆస్పత్రిలోకి తీసుకెళ్లే సమయం లేక పోవడంతో డాక్టర్‌ లక్ష్మీప్రియ సిబ్బందితో కలిసి బస్సులోనే కాన్పు చేశారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్‌ తెలిపారు. సకాలంలో బస్సును ఆస్పత్రి వద్దకు చేర్చిన డ్రైవర్‌ను వైద్యసిబ్బంది అభి నందించారు. ఆడబిడ్డకు జన్మనిచ్చిన ముషీద, కుటుంబ సభ్యులు వైద్య సిబ్బందికి, బస్సు డ్రైవర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా వెస్ట్‌బెంగాల్‌ రాష్ట్రం కోచ్‌ బిహార్‌కు చెందిన వీరు పులి వెందుల ధ్యాన్‌చంద్‌ క్రీడా మైదానంలో జరుగుతున్న నిర్మా ణాల్లో కూలి పనులు చేసుకునేందుకు వచ్చినట్లు తెలిపారు.

Latest News

 
తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్ Thu, Dec 07, 2023, 09:04 PM
ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్‌ విడుదల Thu, Dec 07, 2023, 08:55 PM
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు Thu, Dec 07, 2023, 08:38 PM
విశాఖ చేరుకున్న పవన్ కళ్యాణ్ Thu, Dec 07, 2023, 05:08 PM
తెలంగాణ కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు Thu, Dec 07, 2023, 05:07 PM