మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య

by సూర్య | Thu, Nov 24, 2022, 08:49 AM

పెళ్లికి వయసు చాలదని తండ్రి మందలించినందుకు ఎరుకుల శ్రీనివాసులు (18) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హిందూపురం పట్టణ పరిధిలోని కొట్నూరులో చోటుచేసుకుంది. వన్ టౌన్ సీఐ ఇస్మాయిల్ తెలిపిన వివరాల మేరకు ఎరుకుల రామాంజినేయులు, ఎరుకులు బుజ్జమ్మ దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు శ్రీనివాసులు ఇతను వెల్డింగ్ పనిచేస్తూ ఉండేవాడు. అయితే అనంతపురం కు చెందిన అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. అమ్మాయికి కూడా మైనరేనని తల్లిదండ్రులకు చెప్పాడు. అయితే నీకు వయసు చాలదని పెళ్లీడుకొచ్చాక తప్పకుండా ఆ అమ్మాయితోనే పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు అన్నారు. దీంతో మనస్థాపానికి గురై తన గదిలో చున్నితో పైకప్పుకు ఉరివేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Latest News

 
అతిధికి పట్టుచీర కానుకగా సమర్పించిన సీఎం భార్య Sun, Dec 04, 2022, 09:50 PM
ఆ రెండు ప్రభుత్వాలు ప్రజలకు దగా చేశాయి: టీ.జీ. వెంకటేశ్ Sun, Dec 04, 2022, 09:49 PM
వివాహ రాకపోకల కోసం ఏకంగా విమానం బుక్ చేశారు Sun, Dec 04, 2022, 09:47 PM
రేపో, మాపో టీీడీపీని మూసివేస్తారు: మంత్రి జోగి రమేష్ Sun, Dec 04, 2022, 09:41 PM
వైసీపీలోకి గంటా శ్రీనివాస్...రాజకీయ వర్గాల్లో చర్చ Sun, Dec 04, 2022, 09:40 PM