![]() |
![]() |
by సూర్య | Thu, Nov 24, 2022, 08:46 AM
తాడిపత్రి పట్టణంలోని స్థానిక చింతల వెంకటరమణ స్వామి ఆలయ సమీపంలోని సత్యసాయి భజన మందిరంలో బుధవారం ఉదయం సత్యసాయి. 37వ జయంత్యుత్సవాలు ఘనంగా జరిగాయి. శివ లింగం, సత్యసాయి చిత్రపటాలను రంగు రంగు పూలతో అలంకరించారు. అనంతరం శివలింగానికి గణపతి పూజ రుద్రాభిషేకం నిర్వహించారు. సత్య సాయి భక్తులు సత్యసాయి వ్రతం చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించారు. సత్యసాయి సేవాసమితి సభ్యులు, మహిళలు పాల్గొ న్నారు. యల్లనూరు రోడ్డులోని శ్రీ వాణి పాఠ శాలలో సత్యసాయి జయంతి వేడుకలు జరిగాయి. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకు న్నాయి. పాఠశాల డైరెక్టర్ కార్తీక్, కరస్పాండెంట్ నీలకంఠ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Latest News