మైనార్టీలను చంద్రబాబు ద్వితీయశ్రేణి పౌరులుగానే చూసారు

by సూర్య | Thu, Nov 24, 2022, 08:26 AM

ముస్లిం మైనార్టీలను అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్‌ బాషా అన్నారు. మైనార్టీలను చంద్రబాబు ద్వితీయశ్రేణి పౌరులుగానే చూశారన్నారు. తన ఐదేళ్ల పరిపాలన కాలంలో మైనార్టీలకు మంత్రివర్గంలో స్థానం కూడా కల్పించని చంద్రబాబు.. మళ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయని మైనార్టీలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడన్నారు. చంద్రబాబు ఇచ్చిన ప్రకటన చూస్తే నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదన్నారు. మైనార్టీలను చంద్రబాబు ఏ విధంగా మోసం చేశారో రాష్ట్ర ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా మైనార్టీ సోదర సోదరీమణులందరికీ తెలుసన్నారు. కడపలో డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా విలేకరుల సమావేశం నిర్వహించారు. 

Latest News

 
రేషన్ ఉన్నట్టా.. లేనట్టా? Mon, Dec 04, 2023, 09:41 AM
రైలు క్రింద పడి చనిపోయిన మృతుడిని గుర్తించిన కుటుంబ సభ్యులు Mon, Dec 04, 2023, 09:39 AM
మృతుల ఓట్లు తొలగిస్తున్నాం: ఆర్డీఓ శ్రీనివాస రెడ్డి Mon, Dec 04, 2023, 09:36 AM
ఆటోలో నుంచి జారి పడి చిన్నారి మృతి Mon, Dec 04, 2023, 09:34 AM
కదిరిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు Mon, Dec 04, 2023, 09:04 AM