ఆ రాళ్లు త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్‌ను తాకుతాయి: నారా లోకేశ్

by సూర్య | Wed, Nov 23, 2022, 11:54 PM

అస్మిత్‌రెడ్డిపై జరిగిన దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. టీడీపీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక వైసీపీ ముష్కర మూకలు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాయన్నారు. ఇటీవల చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లదాడికి తెగబడ్డారని, ఇప్పుడు అస్మిత్‌రెడ్డిపై దాడికి తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికార ఉన్మాద ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రజాస్వామ్యానికే ముప్పుగా పరిణమించాయన్నారు. వీధి లైట్లు ఆపేసి చీకట్లో దాడి చేసి పిరికిపందల్లా పోలీసుల వెనక దాక్కున్నారని అన్నారు. దమ్ముంటే ఎదురుగా వచ్చి ఎదుర్కోవాలని సవాలు చేశారు. తాడిపత్రిలో విసిరిన రాళ్లు త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్‌ను తాకుతాయని లోకేశ్ హెచ్చరించారు.

Latest News

 
అర్ధరాత్రి అడవిలో నిలిచిన ఆర్టీసీ బస్సు.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు Mon, Jun 24, 2024, 10:34 PM
కట్టెల కోసం వెళ్తే కనిపించిన వింత ఆకారం.. కట్ చేస్తే ఇద్దరు మృతి.. మన్యంలో మిస్టరీ Mon, Jun 24, 2024, 10:32 PM
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తొలి సంతకం ఆ ఫైల్ మీదే Mon, Jun 24, 2024, 10:02 PM
పార్లమెంట్‌కు సైకిల్‌పై వెళ్లిన టీడీపీ ఎంపీ Mon, Jun 24, 2024, 10:01 PM
అమరావతి రైతుల మరో పాదయాత్ర ప్రారంభం.. మళ్లీ తిరుమలకే, కారణం ఏంటంటే Mon, Jun 24, 2024, 09:59 PM