జేసీ అస్మిత్‌రెడ్డిపై రాళ్లతో దాడి...రంగంలోకి దిగిన పోలీసులు

by సూర్య | Wed, Nov 23, 2022, 11:53 PM

ఎపుడూ టెన్షన్ వాతావరణంతో ఉండే తాడిపత్రి మరోమారు భగ్గుమంది.  టీడీపీ....వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. ఇదిలావుంటే తాడిపత్రి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ జేసీ అస్మిత్‌రెడ్డిపై కొద్దిసేపటి క్రితం దాడి జరిగింది. దీంతో అనంతపురం జిల్లా తాడిపత్రి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అస్మిత్‌రెడ్డి మూడు రోజులుగా తాడిపత్రి మున్సిపాలిటీలోని వివిధ కాలనీల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సాయంత్రం మూడో వార్డులో పర్యటిస్తుండగా వైసీపీ కౌన్సిలర్ ఫయాజ్ బాషా బీడీ ఫ్యాక్టరీ వద్దకు చేరుకోగానే ఆయనపై రాళ్ల దాడి జరిగింది. 


విద్యుత్ సరఫరా ఆపేసిన కొందరు ఆయనపై రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ దాడితో అప్రమత్తమైన టీడీపీ కార్యకర్తలు కూడా రాళ్ల దాడికి దిగారు. ఈ పరస్పర దాడిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఈ దాడి నుంచి తప్పించుకున్న అస్మిత్‌రెడ్డి ఓ ఇంట్లోకి వెళ్లి దాక్కున్నారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వారిని తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు.

Latest News

 
అతిధికి పట్టుచీర కానుకగా సమర్పించిన సీఎం భార్య Sun, Dec 04, 2022, 09:50 PM
ఆ రెండు ప్రభుత్వాలు ప్రజలకు దగా చేశాయి: టీ.జీ. వెంకటేశ్ Sun, Dec 04, 2022, 09:49 PM
వివాహ రాకపోకల కోసం ఏకంగా విమానం బుక్ చేశారు Sun, Dec 04, 2022, 09:47 PM
రేపో, మాపో టీీడీపీని మూసివేస్తారు: మంత్రి జోగి రమేష్ Sun, Dec 04, 2022, 09:41 PM
వైసీపీలోకి గంటా శ్రీనివాస్...రాజకీయ వర్గాల్లో చర్చ Sun, Dec 04, 2022, 09:40 PM