దసరా వేడుకల్లో అపశృతి...జనాలపై పడ్డ రావణ దహన దిష్టిబొమ్మ

by సూర్య | Wed, Oct 05, 2022, 11:23 PM

రావణ దహన కార్యక్రమం హర్యాణాలోని యయునా నగర్ వాసులకు శాపంగా మారింది. దసరా వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. యమునా నగర్‌లో బుధవారం రావణ దహన కార్యక్రమంలో ఆ దిష్టిబొమ్మ అక్కడున్న ప్రజలపై పడిపోయింది. ఈ సంఘటనలో కొంతమందికి గాయాలైనట్టు తెలుస్తుంది. ఎంతమంది గాయపడ్డారనేది ఇంకా అధికారికంగా ధ్రువీకరించ లేదు. కానీ సంబంధించిన వీడియో బయటకొచ్చింది. ఆ వీడియోలో నిప్పులు చిమ్ముతూ దిష్టిబొమ్మ అక్కడున్న వారిపై పడిపోతున్న దృశ్యాలు ఉన్నాయి. దాంతో ప్రజలు పరిగెత్తడం, అరుస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.


దిష్టిబొమ్మ పడడంతో కొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని అంబులెన్స్‌లలో తరలించినట్టు సమాచారం. ప్రజలపై దిష్టిబొమ్మ పడడంతో అక్కడ తొక్కిసలాట వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు వారిని అదుపు చేయాల్సి వచ్చింది. ఈ సంఘటనతో చాలామంది భయాందోళనకు గురయ్యారు. దసరా సందర్భంగా నవరాత్రి ఉత్సవాల చివరి రోజున హర్యాణాలోని పలు ప్రాంతాల్లో రావణ దహన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు.


ఫతేహాబాద్ జిల్లాలో బుధవారం సాయంత్రం పలుచోట్ల రావణుడి దిష్టిబొమ్మలను దహనం చేశారు. భిర్దానా గ్రామంలోని మహర్షి దయానంద్ పాఠశాల సమీపంలోని రావణుడు అత్యంత ఎత్తైన 70 అడుగుల దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో పాటు ఫతేబాద్‌లోని హుడా సెక్టార్‌లోని ఖాళీ స్థలంలో శ్రీరామ సేవాసమితి తరపున దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇక్కడ దిష్టిబొమ్మను క్రేన్‌పై నుంచి ఎత్తే సమయంలో మధ్య నుంచి విరిగిపోయింది. దీంతో దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం ఆలస్యమైంది. అతి కష్టం మీద జేసీబీ సాయంతో దిష్టిబొమ్మను లేపి దహనం చేశారు.


చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి సంవత్సరం దసరా జరుపుకుంటారు. ఈ సందర్భంగా రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథ్ దిష్టిబొమ్మలను దహనం చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ దహన కార్యక్రమాలను వీక్షించడానికి పెద్ద ఎత్తున ప్రజలు వెళ్తుంటారు. హర్యాణాలోనే కాకుండా.. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో దసరా వేడుకల్లో భాగంగా రావణ దిష్టిబొమ్మలను దహనం చేస్తుంటారు.


 

Latest News

 
శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన Thu, May 02, 2024, 05:03 PM
టీడీపీ అభ్యర్థికి మద్దతుగా హీరో నిఖిల్ ప్రచారం Thu, May 02, 2024, 05:01 PM
పుదుచ్చేరి మద్యం పట్టివేత Thu, May 02, 2024, 04:51 PM
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి రాంబాబు Thu, May 02, 2024, 04:38 PM
టీడీపీలో చేరిన పలు కుటుంబాలు Thu, May 02, 2024, 04:32 PM