గడికోట శ్రీకాంత్‌రెడ్డికి డిమోషన్‌...చీఫ్ విప్ నుంచి విప్ గా

by సూర్య | Wed, Oct 05, 2022, 11:23 PM

సొంత జిల్లా నేతకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఝలక్ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డికి డిమోషన్‌ దక్కింది. గతంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా బాధ్యతలు నిర్వహించిన ఆయనకు ఇప్పుడు ప్రభుత్వ విప్‌ బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటికే నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు చీఫ్ విప్ పదవిని అప్పగించిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీకాంత్ రెడ్డిని చీఫ్ విప్ పదవి నుంచి తప్పించారు.. ఆయన కేవలం విప్ పదవికే పరిమితం కానున్నారు.


గడికోట శ్రీకాంత్ రెడ్డి వైఎస్సార్‌సీపీ సీనియర్ నేతగా ఉన్నారు. ఆయనకు మొదటి నుంచి మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా మొదటి కేబినెట్ విస్తరణలో ఆయనకు చీఫ్ పదవి అప్పగించారు. ఆయన కూడా అసెంబ్లీలో చీఫ్ విప్ పదవిలో కీలకంగా వ్యవహరించారు. ప్రతిపక్షానికి కౌంటర్ ఇవ్వడంలో యాక్టివ్‌గా ఉన్నారు. ఆ తర్వాత ఈ ఏడాది జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థలో ఆయనకు అవకాశం వస్తుందని భావించారు. కానీ ఆయనకు అవకాశం దక్కలేదు.


పదవులు రెండున్నరేళ్లకు మారుస్తానన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కొత్తగా చీఫ్ విప్ పదవిని ముదునూరి ప్రసాదరాజుకు అప్పగించారు. ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డిని చీఫ్ విప్ పదవి నుంచి తప్పించారు. ఇకపై ఆయన విప్ హోదాలో కొనసాగనున్నారు. కొత్త చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు కూడా వైఎస్సార్‌సీపీలో సీనియర్ నేతగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్‌సీపీలో జగన్ వెంట నడిచారు.. ఆయన కూడా మంత్రి పదవి రేసులో ఉన్న సామాజిక సమీకరణలతో అవకాశం రాలేదు. అందుకే చీఫ్ పదవి దక్కింది. ప్రసాదరాజు నర్సాపురం ఎమ్మెల్యేగా ఉన్నారు.

Latest News

 
ఈ నెల 23 నుండి డిగ్రీ పరీక్షలు Fri, Apr 19, 2024, 01:22 PM
వ్యక్తి అనుమానస్పద మృతి Fri, Apr 19, 2024, 01:19 PM
క్వింటా చింత పండు గరిష్టంగా రూ.15000 Fri, Apr 19, 2024, 01:18 PM
గుర్తు తెలియని మృతదేహం లభ్యం Fri, Apr 19, 2024, 01:14 PM
వాలంటీరుపై ఎంపీడీవోకు ఫిర్యాదు Fri, Apr 19, 2024, 01:12 PM