సీఎన్ఎన్ పై డొనాల్డ్ ట్రంప్ పరవు నష్టం దావా

by సూర్య | Wed, Oct 05, 2022, 08:51 PM

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోపోద్రిక్తుడయ్యారు. ఈ  సారి ఆయన సీఎన్ఎన్ ఛానల్  పై ఆగ్రహం వ్యక్తంచేశారు.  ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్ పై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరువునష్టం దావా వేశారు. తన పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించినందుకు గానూ 475 మిలియన్ డాలర్లకు ఆయన దావా వేశారు. ఫ్లోరిడాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో లాసూట్ ని ఫైల్ చేశారు. 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను మళ్లీ పోటీ చేస్తాననే భయంతో తనపై తప్పుడు కథనాలను ప్రచురిస్తోందని తన దావాలో పేర్కొన్నారు. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు... పాఠకుల మదిలో తనపై చెడు అభిప్రాయాలు నెలకొనేలా కథనాలను ప్రచురిస్తోందని అన్నారు.  తనను జాత్యహంకారిగా, రష్యాకు బానిసగా, హిట్లర్ గా, తిరుగుబాటుదారుడిగా తప్పుడు కథనాలతో పాఠకులకు చూపిస్తోందని తెలిపారు. మరోవైపు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా సీఎన్ఎన్, ది న్యూయార్క్ టైమ్స్ తదితర మీడియా సంస్థలపై విమర్శలు గుప్పిస్తూనే వచ్చారు. ఫేక్ న్యూస్ అంటూ వాటిని విమర్శించేవారు.

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM