బాలిస్టిక్ మిస్సైల్ ను ప్రయోగించిన ఉత్తర కొరియా

by సూర్య | Wed, Oct 05, 2022, 05:23 PM

ఉత్తర కొరియా తన థోరణీ  మార్చుకోవడంలేదు. తాజాగా  ఉత్తర కొరియా మరోసారి కవ్వింపు చర్యలకు తెరలేపింది. జపాన్ గగనతలం మీదుగా దూసుకెళ్లేలా ఓ బాలిస్టిక్ మిస్సైల్ ను ప్రయోగించింది.  ఉత్తర కొరియాలోని గుర్తు తెలియని ప్రదేశం నుంచి గాల్లోకి లేచిన ఈ క్షిపణి 4,500 కిలోమీటర్లు ప్రయాణించి పసిఫిక్ మహాసముద్రంలో పడిపోయింది. అమెరికా అధీనంలోని గ్వామ్ దీవిని ఈ క్షిపణి తాకగలదని అంచనా. అమెరికా, జపాన్ లను రెచ్చగొట్టేందుకే ఉత్తర కొరియా తాజా క్షిపణి ప్రయోగం చేపట్టినట్టు భావిస్తున్నారు. ఇదిలావుంటే ఉత్తర కొరియా క్షిపణి తన గగనతలం మీదుగా దూసుకెళ్లడంతో జపాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలను సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని సూచించింది. ఈ క్షిపణి ప్రయోగం నేపథ్యంలో, ఉత్తర కొరియాకు హెచ్చరికగా జపాన్, అమెరికా దేశాలు సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టాయి.

Latest News

 
రోడ్డుపై ఆపాడని కానిస్టేబుల్‌ను కొట్టిన యువకుడు.. వీడియో వైరల్ Sun, May 19, 2024, 04:37 PM
ఏపీవాసులకు అలర్ట్.. ఆ జిల్లాలలో భారీ వర్షాలు Sun, May 19, 2024, 04:32 PM
ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్.. 4 రోజుల్లోనే అకౌంట్లలో పడిన రూ.5868 కోట్లు Sun, May 19, 2024, 04:30 PM
మళ్లీ వార్తల్లోకి పద్మావతి యూనివర్సిటీ.. క్యాంపస్ ఆవరణలో మారణాయుధాలు Sun, May 19, 2024, 04:27 PM
నాగబాబు ట్వీట్‌కు పోతిన మహేష్ కౌంటర్ ట్వీట్.. స్నేక్ బాబు, పుష్ప అంటూ ఫైర్ Sun, May 19, 2024, 03:52 PM