రాశి ఫలితాలు: 04-10-2022 మంగళవారం

by సూర్య | Tue, Oct 04, 2022, 01:57 PM

మేషం
స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. పనులు చకచకా సాగుతాయి.

వృషభం
దైవ చింతన కలుగుతుంది. ఉద్యోగాలు అంతగా అనుకూలించవు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు అధిక కష్టంతో అల్ప ఫలితాన్ని పొందుతారు. ప్రయాణాలు మధ్యలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి.

మిధునం
బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. గృహమున బాధ్యతలు చికాకు పరుస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వ్యాపారమున ఆలోచించి ముందుకు సాగడం మంచిది.

కర్కాటకం
వ్యాపార వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ఎంతటి వారినైనా మీ మాట తీరుతో ఆకట్టుకుంటారు.

సింహం
వ్యాపారాలు బాధ పడతాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

కన్య
కుటుంబ విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన స్థానం చలనాలు కలుగుతాయి. ఉద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి.

తుల
ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. మిత్రుల నుంచి రుణ ఒత్తిడి అధికమవుతుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.

వృశ్చికం
దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అధిక శ్రమతో కానీ గాని పనులు పూర్తి కావు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి.

ధనస్సు
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

మకరం
బంధువుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో శ్రమ మరింత అధికం అవుతుంది.

కుంభం
సోదరులతో భూవివాదాలు కొలిక్కి వస్తాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరపు బంధువుల నుండి అందిన శుభవార్తలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.

మీనం
ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. నూతన ఋణ యత్నాలు చేస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.

Latest News

 
టిడిపి అరాచకం మాదిగలపై దాడి Mon, May 06, 2024, 03:59 PM
అల్లి నగరంలో ఎన్నికల ప్రచారం Mon, May 06, 2024, 03:55 PM
పోస్టల్ బ్యాలెట్స్ కి అపూర్వ స్పందన Mon, May 06, 2024, 03:53 PM
పేదల సంక్షేమమే వైసీపీ ధ్యేయం: నాగార్జున Mon, May 06, 2024, 03:51 PM
భైరవకోనలో ప్రత్యేక పూజలు Mon, May 06, 2024, 03:49 PM