అప్రోచ్ రోడ్డు పనులు త్వరలో ప్రారంభిస్తాం: ఎమ్మెల్యే

by సూర్య | Tue, Oct 04, 2022, 11:52 AM

జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం జలాశయం నుంచి వస్తున్న వరదనీరు ఆగిన వెంటనే అప్రోచ్ రోడ్డు పనులను ప్రారంభిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్రెడ్డి అన్నారు. సోమవారం సాయంత్రం ఆయన అప్రోచ్ రోడ్డును పరిశీలించి మాట్లాడారు. ఇటీవల తుఫాను కారణంగా వరదనీరు గండికోట జలాశయానికి రావడంతో నీటిని మైలవరం జలాశయానికి మళ్లించారు. ఆ నీటిని మైలవరం జలాశయం అధికారులు పెన్నానదికి వదలడంతో అప్రోచ్ రోడ్డు దెబ్బతిని రాకపోకలు ఆగిపోయాయన్నారు. దీంతో దాదాపు 16 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మైలవరం జలాశయం నుంచి వస్తున్న నీరు ఆగిన వెంటనే తిరిగి పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడుపొరెడ్డి మహేశ్వరరెడ్డి, పరిశ్రమల శాఖ డైరక్టర్ మార్బుల్ శ్రీను, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM