ఆ తమిళనాడు జాలర్ల..తలరాత మారిపోయింది

by సూర్య | Mon, Oct 03, 2022, 10:43 PM

మనకు జీవితంలో ఎక్కడ టర్నింగ్ పాయింట్ వస్తుందో ఎవరూ చెప్పలేరు. అలాగే చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన తమిళనాడు జాలర్లకు రూ. 50 కోట్ల విలువైన అంబర్‌గ్రిస్ దొరికింది. అంబర్‌గ్రిస్ అనేది తిమింగలం వాంతి. దీనిని సుగంధ ద్రవ్యాల తయారీలో వాడతారు. మార్కెట్లో దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. తిమింగలాల కడుపులో తయారయ్యే దీనిని అవి వాంతి రూపంలో బయటకు పంపుతాయి. దీనిని ‘ఫ్లోటింగ్ గోల్డ్‌’గానూ వ్యవహరిస్తారు. 


తాజాగా ఇది కల్పాక్కం సమీపంలోని జాలర్ల వలకు చిక్కింది. దీని విలువ రూ. 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. చెంగల్పట్టు జిల్లా కల్పాక్కం సమీపంలోని కడప్కాకం గ్రామానికి చెందిన ఇంద్రకుమార్, మాయకృష్ణన్, కర్ణన్, శేఖర్ కలిసి శనివారం చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. వారి వలకు 38.6 కిలోల అంబర్‌‌గ్రిస్ పడింది. దీంతో వారు ఈ విషయాన్ని అచ్చిరుపాక్కం అటవీ అధికారులకు తెలియజేశారు. వారొచ్చి దీనిని స్వాధీనం చేసుకున్నారు.


 

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM