అనుమతి లేదన్న కారణంతో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు

by సూర్య | Mon, Oct 03, 2022, 10:41 PM

అనుమతి లేదన్న కారణంతో ఎస్పీ బాలు విగ్రహాం తొలగింపు వ్యవహారం గుంటూరుజిల్లాలో కలకలంరేపింది. గుంటూరులో గతంలో కళా దర్బార్ సంస్థ ఆధ్వర్యంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేశారు. గుంటూరులోని మదర్ థెరీసా సెంటర్ లో ఈ విగ్రహం ఉంది. అయితే, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అనుమతి లేదన్న కారణంతో ఎస్పీ బాలు విగ్రహాన్ని తొలగించడం వివాదాస్పదమైంది. బాలు విగ్రహం తొలగింపు పట్ల కళాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


కళా దర్బార్ సంస్థ అధ్యక్షుడు పొత్తూరు రంగారావు స్పందిస్తూ, మహాగాయకుడి విగ్రహం పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటు చేసింది ఒక్క గుంటూరులోనే అని వెల్లడించారు. గుంటూరులో 200కి పైగా అనుమతి లేని విగ్రహాలు ఉన్నాయని, బాలు విగ్రహాన్ని ఎందుకు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM