సుఖశాంతులతో, సిరి సంపదలతో తులతూగాలి...ప్రజలకు వై.ఎస్.జగన్ దసరా శుభాకాంక్షలు

by సూర్య | Mon, Oct 03, 2022, 08:48 PM

రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో, సిరి సంపదలతో తులతూగాలి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ సీఎం జగన్ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. లోక కంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు, దుష్ట శక్తులపై దైవశక్తుల విజయానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకుంటున్నామని సీఎం జగన్ వివరించారు.  జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు కలిగేలా దుర్గామాత దీవెనలు, ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు సీఎం జగన్ వివరించారు.

Latest News

 
నీతిమాలిన మాటలు మానుకో సోమిరెడ్డి Fri, Apr 26, 2024, 02:18 PM
టీడీపీ నేతలు చర్చకు సిద్ధమా? Fri, Apr 26, 2024, 02:17 PM
పేద పిల్లలకు ఆసరాగా నిలిచింది జగన్ మాత్రమే Fri, Apr 26, 2024, 02:16 PM
ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఊబిలో ఉండి శ్రీలంక అయిందని చంద్రబాబు మాట్లాడలేదా.? Fri, Apr 26, 2024, 02:15 PM
పియుష్ గోయల్ ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదు? Fri, Apr 26, 2024, 02:15 PM