దుర్గమ్మ తెప్పోత్సవం జరుగుతుందా...లేదా

by సూర్య | Mon, Oct 03, 2022, 07:22 PM

భారీ వరదనీరు రాకతో ఈ సారి బెజవాడ దుర్గమ్మ తెప్పోత్సవం జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. ఇదిలావుంటే ప్రతి ఏటా దసరా సందర్భంగా విజయవాడ వద్ద కృష్ణా నదిలో కనకదుర్గమ్మ తెప్పోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. అయితే ఈసారి కృష్ణా నదికి భారీగా వరద నీరు వస్తుండడంతో దసరా రోజున దుర్గమ్మ తెప్పోత్సవం రద్దు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ అంశంపై అనిశ్చితి ఏర్పడింది.  ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజీకి లక్ష క్యూసెక్కులకు పైగా వరద నీరు వస్తోంది. ప్రకాశం బ్యారేజీలో 30 వేల క్యూసెక్కుల లోపు నీరు ఉంటేనే తెప్పోత్సవం సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో, అమ్మవారి జలవిహారంపై రేపు అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం కానుంది. 


ఇదిలావుంటే ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ, దుర్గమ్మ తెప్పోత్సవానికి జలవనరుల శాఖ నుంచి ఇంకా అనుమతి రాలేదని వెల్లడించారు. దసరా రోజున వరద ప్రవాహం ఎక్కువగా ఉంటే, కనకదుర్గ అమ్మవారితో కూడిన హంస వాహనాన్ని నదిలో ఒకే చోట నిలిపి ఉత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM