కీళ్లనొప్పులా... వీటిని ఆహారంలో చేర్చుకోండి

by సూర్య | Fri, Sep 23, 2022, 04:19 PM

నేటి కాలంలో చాలామంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. నడవాలన్నా, కూర్చోవాలన్నా. కీళ్ల నొప్పుల వల్ల అవస్థలు పడుతున్నారు. జాయింట్‌ పెయిన్స్‌ వృద్ధాప్యంలో ఉన్నవారికి రావడం సహజం.


కానీ ఇప్పుడు నలభై ఏళ్ల వయసున్న వారిని కూడా. ఈ నొప్పులు వేధిస్తున్నాయి. మరి ఈ సమస్యలకి పరిష్కారం ఏంటి? వైద్యులు ఏం సూచిస్తున్నారో తెలుసుకుందామా.!


ఏ వ్యాయామం చేయాలన్నా కీళ్లనొప్పులు వేధిస్తుంటాయని చాలామంది వ్యాయామం చేయడమే మానేస్తారు. అలా కాకుండా. రోజూ వ్యాయామం చేయడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాయామం చేయడం వల్ల. కీళ్లు దృఢంగా ఉంటాయని స్పోర్ట్స్‌ మెడిసిన్‌ నిపుణుడు ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ మనన్‌ వోరా చెప్పారు.
- ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల. బరువు నియంత్రణలో ఉంటుంది. దాంతో కీళ్లపై ఆ ప్రభావం ఉండదని వోరా తెలిపారు.
- ధూమపానం చేసేవారికి కీళ్ల సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి. కీళ్ల సమస్యలు తగ్గాలంటే. తప్పనిసరిగా పొగతాగడం మానుకోవాలి.
- ఆహారంలో క్యాల్షియం, విటమిన్‌ డి ఉండేలా చూసుకుంటే మంచిదని డాక్టర్‌ వోరా అన్నారు. తీసుకునే ఆహరంలో పాలకూర, క్యాబేజీ ఆకు, బ్రోకోలి, బాదం, అవోకాడో, స్వీట్‌ పొటాటో, అరటిపండ్లు, వాల్‌నట్స్‌ చేర్చుకుంటే కీళ్లనొప్పులకు ఉపశమనం కలిగిస్తుందని డాక్టర్‌ మనన్‌ వోరా చెప్పారు. తగు జాగ్రత్తలు తీసుకున్నా. కీళ్లనొప్పులు వేధిస్తుంటే. వైద్యుల సూచనమేరకు శస్త్రచికిత్స చేయించుకోవడం మంచిదని ఆయన అన్నారు.

Latest News

 
టీడీపీలోకి మాజీ సర్పంచ్ కుమారుడు Wed, May 08, 2024, 04:21 PM
వైసిపి పాలనతో విసిగిపోయిన ప్రజలు - ఏరీక్షన్ బాబు Wed, May 08, 2024, 04:19 PM
రాత్రంతా చీకట్లో మగ్గిన చీరాల Wed, May 08, 2024, 04:15 PM
పర్చూరు నియోజకవర్గంలో ధన ప్రవావం Wed, May 08, 2024, 04:13 PM
అన్ని వర్గాలపై పట్టు సాధించేలా కొండయ్య ప్రచారం Wed, May 08, 2024, 04:10 PM