చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర విమర్శలు

by సూర్య | Fri, Sep 23, 2022, 02:02 PM

కుప్పంలో వైఎస్సార్ చేయూత నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబుపై విమర్శలు చేశారు. 'చంద్రబాబు కుప్పంలో నీటి సమస్యను కూడా పరిష్కరించలేదు. కుప్పం నుంచి చాలా తీసుకున్నాడు. ప్రజలకు ఏం కావాలో ఆలోచించలేదు. తన వాళ్లకు కాంట్రాక్టులు ఇచ్చి కమిషన్ల కోసం కక్కుర్తిపడ్డాడు. ఆయన కుప్పంకు నాన్ లోకల్, హైదరాబాద్ కు లోకల్. 14 ఏళ్లు సీఎంగా ఉండి కుప్పంకు ఏం చేయలేదు' అని అన్నారు.


వెన్నుపోటుకు, దొంగనోటుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు అని ఏపీ సీఎం జగన్ అన్నారు. కుప్పంలో చంద్రబాబుకు ఓటు కూడా లేదు. హంద్రీనీవాకు బాబే అవరోధంగా మారాడు. కుప్పం మున్సిపాలిటీలో డబుల్ రోడ్డు కూడా వేయలేకపోయాడు. రోడ్లు కూడా వేయలేని చంద్రబాబు విమానాశ్రయం తీసుకొస్తానని ప్రజల చెవుల్లో పూలు పెట్టాడు. ఇంతకంటే చేతకాని నాయకుడు ఎక్కడైనా ఉంటాడా' అని విమర్శల వర్షం కురిపించారు.

Latest News

 
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీ దంపతులు Tue, Oct 04, 2022, 05:29 PM
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు Tue, Oct 04, 2022, 05:28 PM
కేంద్ర మంత్రితో మంత్రి కాకాని భేటీ Tue, Oct 04, 2022, 05:26 PM
అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభించిన తమిళనాడు గవర్నర్ Tue, Oct 04, 2022, 05:26 PM
చిన్నారులకు ఎమ్మెల్యే ప్రసన్న ఆర్థిక సహాయం Tue, Oct 04, 2022, 05:25 PM