రైతులపై దాడిని ఖండించిన బీసీ యువజన సంఘం

by సూర్య | Fri, Sep 23, 2022, 10:46 AM

బీసీ సామాజిక వర్గం రైతులపై అగ్రవర్ణాల దాడిని సీమాంధ్ర బి. సి. సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు లీలాక్రిష్ణయాదవ్ తీవ్రంగా ఖండించారు. నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా పరిధిలోని మర్రిపాడు మండలం, కృష్ణపురం గ్రామానికి చెందిన బి. సి. సామాజికవర్గం దూదేకుల కులానికి. చెందిన షేక్. అబ్దుల్ అనే రైతు తన తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన 3 ఎకరాల పొలంను 2015 నుండి సాగు చేసుకుంటున్నారని తెలిపారు. పొలం అమ్మ లేదన్న కారణంతో అదే గ్రామానికి అగ్రకులానికి చెందిన వ్యక్తులు బీసీ రైతుపై దాడి చేయడం అన్యాయమన్నారు. దీనిపై అధికారులు విచారించి న్యాయం చేయాలని కోరారు.

Latest News

 
ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీ దంపతులు Tue, Oct 04, 2022, 05:29 PM
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు Tue, Oct 04, 2022, 05:28 PM
కేంద్ర మంత్రితో మంత్రి కాకాని భేటీ Tue, Oct 04, 2022, 05:26 PM
అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభించిన తమిళనాడు గవర్నర్ Tue, Oct 04, 2022, 05:26 PM
చిన్నారులకు ఎమ్మెల్యే ప్రసన్న ఆర్థిక సహాయం Tue, Oct 04, 2022, 05:25 PM